దళిత బంధు అమలుపై సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించారు. పది లక్షల రూపాయలు.. దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతంగా పటిష్టం చేయడంలో దోహద పడుతుందన్నారు. ప్రకటించిన పద్ధతిలోనే ప్రభుత్వం అమలు చేస్తుందని.. దానికి సంబంధించిన నిధులను త్వరలో విడుదల చేస్తామని కేసీఆర్ చెప్పారు.


డిసెంబర్ 28 నుంచి రైతు బంధు


డిసెంబర్ 28 నుంచి.. రైతు బంధు పంపిణీ జరగనుందని.. సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ మేరకు పది రోజుల్లోనే.. అందరి ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది. గతంలో మాదిరిగానే ఎకరం నుంచి మొదలుకుని అందరికీ నగదు జమచేయనున్నారు. యాసంగి సీజన్ పంటల సాగు వేళ రైతు బంధు నగదును పంపిణీ చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బ్యాంకు ఖాతాల్లోకి రైతు బంధు నగదు జమ కానుంది. ఈ మేరకు అధికారులు ఇప్పటికూ పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.


రాష్ట్ర రైతులకు ఎకరానికి 5వేల రూపాయల చొప్పున కోటిన్నర ఎకరాలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. తెలంగాణ రైతులకు పంట సాయం కోసం తీసుకొచ్చిన రైతు బంధు పథకానికి  రూ. 7500 కోట్ల నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. డిసెంబర్ 28 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు జమ చేయాలని సీఎం కేసీఆర్ ఇదివరకే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


మెుదట ఎకరం భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాలో రైతు బంధు కింద రూ.5 వేలు జమ అవుతాయి. ఆ తర్వాత రెండు ఎకరాలు ఉన్న వారికి, అనంతరం మూడు ఎకరాలు, ఆ తరువాత 5, 10, 15, 20 ఎకరాలు అంతకంటే ఎక్కువ ఎకరాల భూమి ఉన్న తెలంగాణ రైతులకు రైతు బంధు నిధులను ఆర్థికశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. గతంలోనూ ఇదే విధంగా రైతు బంధు నగదు విడుదల చేశారు.


వానాకాలం సీజన్‌కు సంబంధించి దాదాపు 60.84 లక్షల మంది రైతులకు రైతుబంధు లభించింది. అంటే దాదాపు రూ.7,360.41 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. సుమారు 1.47 కోటి ఎకరాలకు నిధుల పంపిణీ చేసింది. తాజాగా మరికొంత మంది అర్హులైన రైతులకు రైతు బంధు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విమర్శలు చేసుకుంటుండగా.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూడక తప్పడం లేదు.


Also Read: Cm Kcr: ఉద్యోగుల విభజనపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు... కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన


Also Read: Warangal: భార్య తోడు కోసం ఇద్దరు భర్తల పోరాటం.. మొదటి భర్తకు ట్విస్ట్, ఆ తర్వాత ఇద్దరికీ షాక్!


Also Read: Monkeys Survey: గ్రామాల్లో కోతులెన్ని తిరుగుతున్నాయి? అవి ఎక్కడ ఉంటున్నాయి? ఏఈఓలకు లెక్కింపు బాధ్యత