కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరను నిర్ణయించింది టీటీడీ. సాధారణ రోజుల్లో ఉదయాస్తమాన టికెట్ ధర.. కోటి రూపాయలు ఉండగా.. శుక్రవారం రోజున కోటిన్నరగా నిర్ణయించారు. టీటీడీ దగ్గర 531 ఉదయాస్తమాన సేవా టికెట్లు ఉన్నాయి.
ఉదయాస్తమాన టికెట్ తో సుమారు 25 ఏళ్ల పాటు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఏడాదికి ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆరుగురు భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. ఉదయాస్తమాన సేవా టికెట్లకో టీటీడీకి 600 కోట్ల పైగా ఆదాయం రానుంది.
విరాళాల మొత్తంతో చిన్నారుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించనున్నారు. 2022 జనవరి రెండో వారం నుంచి టికెట్ల కేటాయింపునకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 23న ట్రయల్ రన్ నిర్వహించనుంది. శ్రీవారికి తిరుమలలో ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే ఆర్జిత సేవలను ఉదయాస్తమాన సేవ అంటారు. సుప్రభాత సేవ, తోమాల సేవ, కొలువు, అష్ట దళ పాద పద్మారాధన (సువర్ణ పుష్ప అర్చన), అభిషేకం, వస్త్రాలంకార సేవ, కల్యాణోత్సవం, రథోత్సవం, తిరుప్పావడ, సహస్ర దీపాలంకరణ సేవ, ఏకాంత సేవ జరుగుతాయి.
త్వరలో ఘాట్ రోడ్ పనులు పూర్తి
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల రెండో ఘాట్ రోడ్ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. మరమ్మతు పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని చూస్తున్నారు. వైకుంఠ ఏకాదశిలోపు పూర్తిస్థాయిలో వాహనాల రాకపోకలకు అనుమతించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.., చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించారు.
Also Read: Spirituality: గుడ్ల గూబను అశుభం అనుకుంటే పొరపాటే.. ఈ విషయం తెలుసా..
Also Read: Christmas Special: కిస్మస్ రోజు 'ట్రీ' ని ఎందుకు అలంకరిస్తారు.. చెట్టుకి -వేడుకకు సంబంధం ఏంటి..
Also Read: Cm Kcr: ఉద్యోగుల విభజనపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు... కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన
Also Read: Warangal: భార్య తోడు కోసం ఇద్దరు భర్తల పోరాటం.. మొదటి భర్తకు ట్విస్ట్, ఆ తర్వాత ఇద్దరికీ షాక్!
Also Read: Monkeys Survey: గ్రామాల్లో కోతులెన్ని తిరుగుతున్నాయి? అవి ఎక్కడ ఉంటున్నాయి? ఏఈఓలకు లెక్కింపు బాధ్యత