మేషంఈరోజు మీ వ్యక్తిగత జీవితంలో ఆహ్లాదకరమైన అనుభవాన్ని పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలొస్తాయి. కుటుంబ సమేతంగా ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందరించే అవకాశం ఉంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.వృషభంనిరుద్యోగులకు కలిసొచ్చే సమయం కెరీర్‌లో పురోగతికి అవకాశాలు ఉంటాయి. ఈ రోజు ప్రారంభంలో శుభవార్తలు అందుకుంటారు. అప్పులు తీర్చడం వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది. జీవిత భాగస్వామికి కెరీర్‌లో పెద్ద విజయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల సలహాల వల్ల ప్రయోజనం పొందుతారు. ఉద్యోగస్తులకు శుభసమయం.మిథునంఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఖర్చులు పెరుగుతాయి. పని విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. పిల్లల విషయంలో కొంత ఆందోళన ఉండొచ్చు. మీ పనితీరుపై విమర్శలు రావొచ్చు. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. అనారోగ్య సమస్య ఉండొచ్చు.Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..కర్కాటకంఈరోజు మంచి రోజు అవుతుంది. మీ నైపుణ్యంతో ప్రశంసలు అందుకుంటారు. జీవిత భాగస్వామి ప్రేమలో మునిగితేలుతారు. ఇంటికి అతిథులు వస్తారు. మీరు డబ్బు సంపాదించవచ్చు. యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. ఎప్పటి నుంచో వస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. సింహంఈరోజు మీరు కొంత గందరగోళంలో ఉంటారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు మంచిది. ప్రభుత్వ పనులకు సంబంధించిన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకుంటారు. అధిక పని కారణంగా మీరు మరింత కష్టపడవలసి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.కన్యమితిమీరిన పని వల్ల కుటుంబానికి సమయం ఇవ్వలేకపోవచ్చు. మీ స్నేహితులతో పోటీ పడకండి. అధికారులు మీ పనులకు ఆటంకం కలిగిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అనవసర ప్రయాణాలు చేయవలసి రావచ్చు.Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..తులఈరోజు బాగానే ఉంటుంది. మీరు కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. కుటుంబ సభ్యుల ప్రవర్తన గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ఎక్కువగా నమ్మవద్దు. మీరు పని చేసే విధానాన్ని మార్చుకోండి. మీ అభిప్రాయాలపై వ్యతిరేకత రావొచ్చు. పాత స్నేహితుడిని కలుస్తారు.వృశ్చికంఈ రోజు మంచి రోజు అవుతుంది. కుటుంబ సభ్యుల కోరికలు నెరవేర్చే ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో ఆదాయం పెరగడంతో మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తారు. వ్యక్తిగత జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కార్యాలయంలో అధికారుల నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది. అపరిచితులను ఎక్కువగా నమ్మొద్దు. థనుస్సు ఈ రోజు మీరు ఎవరికైనా సహాయం చేస్తారు. సామాజిక కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగాలు చేసే వారికి శుభసమయం. మీరు మీ జీవిత భాగస్వామికి బహుమతులు ఇస్తారు. జూనియర్ సహోద్యోగులతో సమన్వయ లోపం ఉంటుంది.Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...మకరంఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ప్రేమ వివాహం కోసం చర్చలుంటాయి. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. విద్యార్థులు కొత్త కోర్సులో ప్రవేశం పొందుతారు . మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.కుంభంఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. మీరు ఈరోజు కొంత ఆందోళనకు గురవుతారు. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు చేయకండి. నిరుత్సాహపరిచే ఆలోచనలు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. గొంతుకు సంబంధించిన సమస్య రావొచ్చు. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. రిస్క్ తీసుకోకండి. అందరినీ నమ్మవద్దు.మీనంఈ రోజంతా సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉండొచ్చు. ప్రేమ సంబంధాల తీవ్రత పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రజా పనుల్లో నిమగ్నమైన వారికి ఈ రోజు కలిసొస్తుంది. ఇంటికి అతిధులు వచ్చే అవకాశం ఉంది. మీ సామర్థ్యం పెరుగుతుంది. Also Read: చెడు మాట్లాడకు.. తథాస్తు దేవతలున్నారు అంటారు కదా.. నిజంగా ఉన్నారా, దీని వెనుక అసలు విషయం ఏంటి..Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమటAlso Read: కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..Also Read: ప్రతిష్ఠాత్మక యునెస్కో జాబితాలో చేరిన కోల్ కతా దుర్గామాత వేడుకలుఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Horoscope Today 18 December 2021: శనివారం ఈ రాశులవారికి కలిసొస్తుంది..మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి..
ABP Desam | RamaLakshmibai | 18 Dec 2021 06:03 AM (IST)
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
2021 డిసెంబరు 18 శనివారం రాశిఫలాలు