Visakha Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల బంద్ చేపట్టాయి. నేడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు గానూ విశాఖ బంద్‌కు పిలుపునిచ్చారు. మార్చి 29న జాతీయ సమ్మెకు కార్మిక సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. బంద్ నేపథ్యంలో విశాఖలో సోమవారం ఉదయం నుంచే నగరంలో కార్మిక, ఉద్యోగ సంఘాలు, సీపీఎం, సీపీఐ నేతలు పలు చోట్ల నిరసనలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సైతం బంద్‌కు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆర్టీసీ డిపోల వద్ద బైఠాయింపు.. (Visakhapatnam bandh Today)
మద్దెలపాలెం, స్టీల్ ప్లాంట్, హనుమంత వాక, గాజువాక జంక్షన్ లలో ధర్నాలకు దిగారు. మద్దిలపాలెం RTC డిపో వద్ద వాయపక్షాలు ధర్నాకు దిగడంతో బస్సులు నిలిచిపోయాయి. రెండు రోజులపాటు నిర్వహించే నిరసనలు, ఆందోలనలకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. సీతమ్మధారలోని యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీసు వద్ద ధర్నా చేస్తున్నారు. రైతు చట్టాలను వెనక్కు తీసుకున్నట్టే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణనూ వెనక్కు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కార్మిక సంఘాయి కోరాయి. వామపక్షాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నేడు జరుగుతున్న బంద్‌లో ఏపీఎస్ ఆర్టీసీ పాల్గొనడం లేదు. నేడు, రేపు బస్సులు యథాతథంగా నడుస్తాయని ఇంఛార్జి రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు స్పష్టం చేశారు. అయితే తాము బంద్‌కు సంఘీభావంగా ఉద్యోగులు, కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు కొనసాగిస్తారని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ విధానాలకు వ్యతిరేఖం..
ప్రధాని మోదీ విధానాలకు వ్యతిరేకంగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Vizag Steel Plant Privatisation)కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కార్మికులు నిరసన చేపట్టామని వామపక్ష నేత నరసింగరావు అన్నారు. కార్మికుల కనీసం వేతం 26 వేలు ఉండాలని, లేబర్ కోర్టులను రద్దు చేయాలని, కార్మికులను బానిసలుగా మార్చవద్దని కోరుతూ ఉద్యమం. చేస్తున్నాం. కానీ బీజేపీ మొండిగా ముందుకెళ్తోందని, వారికి వ్యతిరేకంగా ప్రజలు సైతం బంద్‌లో పాల్గొనడానికి వస్తున్నారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కార్మికులను రెగ్యూలర్ ఉద్యోగులుగా గుర్తించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం గతంలో అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. అప్పుడు బస్సులు, విద్యా సంస్థల్ని స్వచ్ఛందంగా మూసివేసిందని గుర్తుచేశారు. కానీ నేడు ఏపీ ప్రభుత్వం బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు కనిపించడం లేదని, ద్వంద్వ వైఖరిని మానుకోకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
Also Read: Sattenapalli TDP : సత్తెనపల్లి టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు, టెంట్లు కూల్చేసి ఒకరిపై ఒకరు దాడి!