Occult Rituals In Srikakulam District: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఇచ్చాపురం మండలం బుడ్డెపుపేట గ్రామం దక్కత గీత అనే మహిళ ఇంటిముందు గుర్తు తెలియని వ్యక్తులు పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. నడిరోడ్డుపై ముగ్గేసి క్షుద్రపూజలు చేసినట్టు ఉండటంతో ప్రజలు భయపడుతున్నారు. దాని చుట్టూ, మంత్రించిన నిమ్మకాయలు, దిష్టిబొమ్మ ఉంది.
ఇచ్ఛాపురం మండలం బుడ్డెపుపేట గ్రామంలో వెలుగు చూసిన ఈ పూజలు ఆంధ్రా ఒడిశా బోర్డర్‌లో కలకలం రేపాయి. బుడ్డెపుపేటకు చెందిన దక్కత గీత ఇంటి ముందు నడిరోడ్డు మీద పూజలు చేశారు. అర్థరాత్రి తరువాత ఈ పూజలు చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో ముగ్గువేసి కుంకుమ, పసుపు, నిమ్మకాయలు పేర్చి, దిష్టి బొమ్మ పెట్టి కోడిని కోసి వదిలిపెట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. వాటిని చూసిన స్థానికులు భయపడుతున్నారు.
2 సంవత్సరాల క్రితం కూడా మండపల్లి పరిసరాలలో ఇలానే క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించాయని స్థానికులు చెబుతున్నారు. ఈ గ్రామంలో ఇలా జరగటం మొదటిసారని అంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతోందో అర్థం కావడం లేదన్నారు. ఈ క్షుద్రపూజలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని గ్రామస్తులు కలవర పెడుతున్నారు.
నడి రోడ్డుపై ముగ్గేసి క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆనవాళ్లతోపాటు.. దాని చుట్టూ రక్తపు మరకలుండడంతో కోడికోసి ఉంటారని అంటున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఎవరు దీనికి పాల్పడ్డారో అంటు ఆరా తీస్తున్నారు. పోలీసులు, ప్రజాసంఘాలైన ఆ గ్రామంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని కోరుతున్నారు.
ఈ పూజల సంగతి విజువల్స్ ఫొటోలు వైరల్‌గా మారాయి. అక్కడ ఉన్న పూజా సామగ్రి తొలగించేందుకు భయపడ్డారు. ఇప్పటికైనా ఇలాంటి పూజలు చేస్తున్న వారిని పోలీసులు తక్షణమే అరెస్టుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామ కమిటీలను వేసి ఇలాంటి పూజలు నిర్వహిస్తున్న వారిని ఎక్కడెక్కడ ఉంటారు వెతికిపట్టుకోవాలన్నారు.
Also Read: వార్డెన్ తాగి కొడుతుంది, వార్డెన్ భర్త అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు- ధైర్యంగా బాలికల ఫిర్యాదు