Woman Chops Off Neighbour Private Parts With Sharp Weapon: ప్రైవేటు పార్టులు కట్ అయిపోయిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చేరినట్లుగా తెలియడంతో పోలీసులు వెళ్లి కేసు నమోదు చేసుకున్నారు. ఏం జరిగిందో అతను చెబుతూంటే వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని బందా ప్రాంతానికి చెందిన వ్యక్తి నగర్ కత్వాల్ అనే ఎరియాలో నివాసం ఉంటున్నాడు. మధ్యతరగతి కి చెందిన వ్యక్తి కావడంతో వారు ఉండే కాలనీలో ఇళ్లు అన్నీ పక్క పక్కనే ఉంటాయి. అతను కూడా అందరితో కలుపుగోలుగా ఉంటాడు. అయితే హటాత్తుగా పక్కింటి మహిళ ఆ వ్యక్తి ఇంట్లోకి వచ్చింది. తనతో శృంగారం చేయాలని బలవంతం చేసింది. ఆ వ్యక్తి మొదట త మాషాకు అంటుందేమో అనుకున్నాడు. కానీ ఖచ్చితంగా తనతో శారీరకంగా కలవాల్సిందేనని ఆ మహిళ ఒత్తిడి తెచ్చింది.