Jani Master Controversy: జానీ మాస్టర్‌ను కొంత కాలంగా వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్ యూనియన్ నుంచి ఆయనను శాశ్వతంగా తొలగించారంటూ సోమవారం ఉదయం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. జోసెఫ్ ప్రకాష్ భారీ మెజారిటీతో అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించారని, అనంతరం జానీ మాస్టర్‌ను తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు వినిపించాయి. కానీ జానీ మాస్టర్ ఈ వార్తలను ఖండించారు. దీనిపై ఒక వీడియోను కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
‘గేమ్ ఛేంజర్’లో సాంగ్ చేస్తున్నా...
ఈ వీడియోతో పాటు ఆయన క్యాప్షన్ కూడా పెట్టారు. అందులో ‘ నిర్ధారణ అవ్వని ఆరోపణలని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుంచి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి! నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాను. టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, పని దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరు. నా కొరియోగ్రఫీలో గేమ్ ఛేంజర్ నుంచి ఓ మంచి పాట రాబోతుంది. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.’ అని అందులో పేర్కొన్నారు.
Also Read: బంజారా హిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
న్యూస్ తెలుసుకుని పెట్టండి...
కొన్ని మీడియా సంస్థలు తెలిసీ, తెలియకుండా అవతలి వాళ్ల మనసులు బాధ పెట్టేలా ఉన్నది, లేనిదీ న్యూస్‌లు పెడుతున్నారని, కరెక్ట్ న్యూస్ తెలుసుకుని పెట్టమని కోరారు. యూనియన్ నుంచి ఎవర్నీ శాశ్వతంగా తీసేసే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ముత్తురాజ్ మాస్టర్ ప్రారంభించిన యూనియన్ ద్వారానే తనకు మంచి పేరు వచ్చిందని తెలిపారు. ఇప్పుడు తాను పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అవ్వడానికి కూడా అదే కారణం అన్నారు. ఆ యూనియన్‌లో జరిగిన ఎన్నికల విషయంలో తాను లీగల్‌గా ఫైట్ చేస్తానని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం తన దగ్గర పని చేస్తున్న చాలా మంది డ్యాన్సర్లు త్వరలో కొరియోగ్రాఫర్లు అవ్వబోతున్నారని కూడా ప్రకటించారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూాడాలి!
Also Read : అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?