Andhra Pradesh News : నంబాళ్ల కేశవరావు. ఈ పేరు కేంద్ర రాష్ట్ర పోలీసు రికార్డులలో మోస్ట్ వాంటెడ్ పర్సన్. ఈయన మరో పేరు బసవరాజు మావో సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్‌గా ఉన్నారు. నవంబర్ 2018 లో, ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత అతను పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యాడు . మొన్నటికి మొన్న చత్తీస్ ఘడ్ లో జరిగిన కాల్పుల్లో మృతి చెందాడనే పుకార్లతో మరో సారి ఆయన పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరి ఈ యన స్వగ్రామం ఎక్కడ.. ఆ గ్రామస్తులు, బంధువులు ఏమనుకుంటున్నారో ఈ స్టోరీ చదవండీ.


కనిపిస్తున్న ఈ పల్లె  సీపీఐ మావోయిస్టు చీఫ్, భారతదేశ 'మోస్ట్ వాంటెడ్' వ్యక్తి నంబాల కేశవరావు ప్రాంతం. ఈ గ్రామంలో శ్రీకాకుళం జిల్లా కొటబొమ్మాళి మండలం జీఎన్ పురం. అక్కడ కేశవరావు అలీయాస్ బసవరాజ్ కు బంధువులు ఉన్నారు. తల్లి, సోదరుడు ఉన్నారు. కేశవరావుకు ఆ గ్రామంలో ఈతరం వాళ్లకు పరిచయం లేదు. అయినా ఆయనకొసం విన్నామంటున్నారు. మంచి వ్యక్తిగానే పేరుండేదని చెబుతున్నారు. ఆ యన తండ్రి స్కూల్ టీచర్ గా చేసేవారని కేశవరావు వరంగల్ లో ఎంటెక్ చదువుకున్నాడని కుటుంబసభ్యులు పేర్కోంటున్నారు. ఆయన అయిద వతరగతి వరకు చదువుకున్న స్కూల్ చూస్తే ఎవరికైన ఆశ్చర్యపోక తప్పదు. ప్రస్తుతం  ఆగ్రామానికి స్కూల్ లేదు. ఉన్న స్కూల్ పూర్తిగా పాడైపోవడంతో పశువుల శాలగా మారింది.  నంబాళ్ల కోసం కుటుంబసభ్యులు ఎదురు చూసిన రోజులున్నాయి. రాడికల్స్ గా 1983 లో అరెస్టు అయిన తరువాత కుటుంబసభ్యులు ఎంతగానో ప్రాధాయ పడ్డారంటా ఉద్యమాలు వద్దు... గ్రామంలోకి వస్తే వ్యవసాయం చేసుకుందామని విశాఖ పట్నంలో జైలులో ఉండేటపుడు ఆయనను కలిసి ఎంతమంది ఒప్పించిన సరే అంటునే మరల ఆయన అడుగులు అడవివైపు పడ్డాయని చెబుతున్నారు.


చదువులో ఘనాపాటి అని, మంచికి మారు పేరని ఇలా గ్రామస్తులు ఆయనకోసం తెలిసిన వారు..విన్నవారు ఒక్కోరకంగా చెబుతున్నారు. తొలినుంచి ప్రజాసేవంటే మక్కువని అందుచేత తామెన్ని విధాలుగా నచ్చజెప్పిన తిరిగి ఉద్యమాల్లో కి వెళ్లాడని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గతంలో నక్జల్ బరిలో ఉద్యమంలో చేరిన తరువాత గ్రామానికి ఎప్పడు రాలేదని తల్లి, సోదరుడు చెబుతున్నారు. ఆయన కోసం పోలీసులు వచ్చిన సందర్భాలున్నాయే గాని మావాళ్లు ,మాబంధువులంటు కేశవరావు ఒక్క రోజు కూడ గ్రామానికి రాలేదని చెబుతున్నారు. ఉద్యమబాటపట్టిన ఆయన రోజు రోజుకు ఆ పార్టీలో ఉన్న తశిఖరాలకు చేరుకోగలిగారే తప్ప గ్రామంలో, బంధువులు ఇంట ఒక్క రోజు అడుగు పెట్టలేదని  ఏఇంటి తలుపు తట్టిన చెబుతున్నారు. 
ఛత్తీస్ గఢ్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో చాలా మంది మృతి చెందడంతో ఈయన కూడ ప్రాణాలు కోల్పోయారని ప్రచారం సాగింది. కేశవరావు స్వగ్రామమైన జీఎన్ పురం గ్రామానికి పోలీసులు వెళ్లి వాకబు చేశారు. ఒకానొక దశలో మరణించారని అనుమానం వ్యక్తం చేయడంతో బాధనిపించిందని కుటుంబీకులు, స్థానికులు చెబుతున్నారు. ఈ సారి కాదు గతంలో అనేక సార్లు ఈ వ్యాఖ్యలు విని బాధపడిన సందర్భాలు ఉన్నాయంటున్నారు.
Also Read: AP Liquor Shops: మద్యం షాపులు దక్కించుకున్న వారికి బెదిరింపులు, సీఎం చంద్రబాబు సీరియస్! 


 సిక్కోలు జిల్లాలో  ఆయన పేరు మారు ప్రస్తావనకు వచ్చింది. ఆయనపై కోటి రూపాయలకు పైగా ప్రభుత్వాలు రివార్డలు ప్రకటించాయని స్థానికులు తెలుసంటున్నారు. ఫోటోలు వెల్లడిస్తే గుర్తు పట్టే అవకాశం ఉంటుందని స్వగ్రామస్తులు భావిస్తున్నారు. అయినా దశాబ్దాల క్రితం జిల్లా నుంచి ఉద్యమంలోకి వెళ్లిన ఆయనను గుర్తు పట్టడం కష్టమేనని జిల్లా వాసులు అంటున్నారు. ఆయన ఉద్యమంలోకి వెళ్లిన  అరెస్టు అయినతరువాత ఒక్క  ఫోటో తప్ప మరే ఆదారాలు లేవు. దీనిపై ఆకుటుంబీకులు గాని, ఆయన స్వగ్రామస్తులకు ఎటువంటి సమాచారం లేదు. పోలీసులు ప్రచురించిన ఫోటోనే చక్కర్లు కొడుతుంది. 


ఇటీవల జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో నంబాళ్ల కేశవరావు ఉన్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగడంతో మరోసారి ఆయనను తలంచుకున్నామని స్థానికులుచెబుతున్నారు. కోటబొమ్మాళి మండలం జిఎన్ పేట కు చెందిన కేశవరావు ప్రాధమిక విద్య సొంతగ్రామంలోనే సాగింది. తాతగారి ఊరు అయిన టెక్కలి మండలం తలగాంలో హౌస్కూల్ విద్య, టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన ఆయన  డిగ్రిలో అదే టెక్కలిలో స్కూల్ చదువు పూర్తిచేశారు. రెండో సంవత్సరం డిగ్రి చదువుతుండగా వరంగల్ బిటెక్క సీటు రావడంతో అక్కడి కి వెళ్లి జాయిన్ అయ్యారని అక్కడనుంచి కథ మారిపోయిందని చెబుతున్నారు.  


వరంగల్ లోని కాకతీయ రీజినల్ ఇంజనీర్ కళాశాలలో చేరియ ఆయన  బీటెక్ చదువుతుండగా రాడికల్ విద్యార్ధి సంఘం వైపు అడుగులు వేశారంటున్నారు. అయిన ఎంటెక్క పూర్తి చేశారని అనంతరం ఏర్పడిన పరిణామాలలో1983 నుంచి పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లి పోయారని చెబుతున్నారు.  జిల్లా కమిటి స్థాయి నుంచి అంచెలంచెలుగా పీజీఎల్ ఏ కమాండెర్ గా ఎదిగిన కేశవరావు మూడేళ్ల క్రితం పార్టీ చీఫ్ గా నియమితులవ్వడం విని ఓ వైపు ఆశ్చర్యపోగా మరివైపు ఇదేమిటి కుటుంబానికి దూరమై వెళ్లిపోతున్నాడంటు మధనపడ్డామంటున్నారు స్థానికులు .  గతంలో పోలీసులు ఆగ్రామ యువతను ఆకట్టుకునేందుకు లైబ్రరీని ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎప్పటికప్పుడు ఇంటీలిజెన్స్ వర్గాలు గ్రామం దృష్టి సారిస్తునే ఉన్నాయి. 


Also Read: AP Liquor Shop Timings: ఈ 16 నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ, మద్యం షాపుల టైమింగ్స్ ఇవే