Araku festival to be held after 5years | ఐదేళ్ల తర్వాత మళ్లీ 'అరకు ఫెస్టివల్ ' జరగబోతుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి రెండు వరకు మూడు రోజులు పాటు అరకు ఉత్సవం " (Araku Utsav) జరుపుతోంది ఏపీ ప్రభుత్వం. ఈ మూడు రోజులు అరకులోయ లో చాలా వెరైటీ ప్రోగ్రామ్స్ కు స్వాగతం పలకబోతోంది. ఎటు చూసినా రంగు రంగుల లైట్లు, గిరిజన సంప్రదాయాలు, యువకుల ఆనందోత్సాహాల నడుమ పర్యాటకులకు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయింది.
అరకు ఉత్సవాల్లో విశేషాలు ఇవే
ఈ సారి అరకు ఉత్సవాల్లో ఏపీకి చెందిన గిరిజనుల సంప్రదాయాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన గిరిజనుల సంస్కృతులు Shubhkamnaye కూడా ప్రదర్శించబోతున్నారు. ముందుగా జనవరి 31న మారదాన్, పెయింటింగ్ , ముగ్గుల పోటీలు, స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. వాటితో పాటే ఈసారి హాట్ ఎయిర్ బెలూన్స్, పారా గ్లైడింగ్ లాంటి అడ్వెంచర్స్ పర్యాటకుల కోసం రెడీ అవుతున్నాయి. ఇప్పటికే వాటి ట్రైల్ రన్ కూడా అని పూర్తయింది. వీటితో పాటు అక్కడ ఉన్న కాఫీ తోటలు,మ్యూజియం, స్ట్రా బెర్రీ తోటలు, చెక్కవంతెన, ట్రైబల్ మ్యూజియం లను టూరిస్ట్ లను ఆకట్టుకునేలా మరింత సుందరంగా రెడీ చేశారు.
పూర్తిగా ప్లాస్టిక్ రహిత అరకు ఉత్సవం
అలాగే జలపాతాల వద్ద అదనపు సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈసారి అరకు ఫెస్టివల్ పూర్తిగా ప్లాస్టిక్ రహిత ఉత్సవం గా జరగబోతుంది. టూరిస్టులు ముందుగానే దీనికి సిద్ధ పడి రావాలి. అరకు తో పాటు పక్కనే ఉన్న బుర్రా గుహల్లోనూ ఇకపై ప్లాస్టిక్ నిషేధం కఠినం గా అమలవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, పర్యాటక శాఖ మంత్రి మంత్రి కందుల దుర్గేష్, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ లాంటివారు ఈ అరకు ఉత్సవానికి సంబంధించిన ప్రతిష్టాత్మకంగా రెడీ చేస్తున్నారు.
ఐదేళ్ల తర్వాత జరుగుతున్న "అరకు ఉత్సవ్ "
'అరకు ఫెస్టివల్ ' "అరకు కోల్డ్ ఫెస్టివల్ " ఇలా రకరకాల పేర్లతో జరుగుతున్న ఈ సంబరాలను 2019 కు ముందు టిడిపి ప్రభుత్వం ప్రతి ఏటా జరుపుతూ వచ్చింది. 2019 జనవరి లో చివరిసారిగా ఇక్కడ బెలూన్ ఉత్సవ్ జరిగింది. తర్వాత ఇక్కడ గత ఐదేళ్లు ఇలాంటి ఫెస్టివల్స్ జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మళ్లీ అరకు ఉత్సవాలకు రంగం సిద్దమైంది. ఏపీ టూరిజంకు పాపులారిటీ తేవడంతో పాటు స్థానిక వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా ఈ అరకు ఉత్సవం ఉపయోగపడుతుందని అక్కడి గిరిజనులు చెబుతున్నారు.
ఫిబ్రవరి ఎండింగ్ వరకు అరకు సీజన్ ఉంటుంది. కాబట్టి అరకు వాతావరణాన్ని, అందాలను ఎంజాయ్ చేయడానికి ఇది సరైన సమయంగా టూరిస్ట్ గైడ్ లు చెప్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. అరకు ఫెస్టివల్ లో పాల్గొని అక్కడి ప్రకృతి అందాలను మనసారా ఎంజాయ్ చేసి రావడానికి రెడీ అయిపోండి.
Also Read: Pawan Kalyan Letter: జన సైనికులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ- వాటి జోలికి వెళ్లొద్దని కీలక సూచనలు