A Woman Was Dragged By Her Hair On The Sidewalk In Visakha: విశాఖలో (Visakha) దారుణం జరిగింది. ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు జుట్టు పట్టుకుని మరీ నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. మధురవాడ (Madhurawada) పీఎంపాలెంలోని మిధులపురి వుడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తోన్న ఓ మహిళపై.. మరో మహిళ సహా ఇద్దరు వ్యక్తులు కిరాతకంగా ప్రవర్తించారు. ఆమెను కిలోమీటర్ పొడవునా నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తిరిగి తననే బెదిరిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
ఎలాంటి విచారణ కూడా చేయకుండానే ఇరు వర్గాలపైనా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారని వాపోయింది. హోటల్ సమయం మించి నిర్వహిస్తున్నందున తనపై కేసు నమోదు చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించింది. కేసును రాజీ చేసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారని తెలిపింది. ఈ క్రమంలో పోలీసులపై సీపీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది. కాగా, ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
Also Read: Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం