Top 5 Telugu Headlines Today 10 October 2023: 


చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ మళ్లీ శుక్రవారం - విచారణ వాయిదా !
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో   చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ శుక్రవారానికి వాయిదాపడింది.  చంద్రబాబు తరఫున వా సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే 17ఎ సెక్షన్‌కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను ప్రస్తావించారు. అనంతరం సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. అత్యవసర కేసులు విచారణ ఉన్నందున మధ్యాహ్నం రెండు తర్వాత ఆ కేసులను ధర్మాసనం టేకప్ చేసింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాలు  
కేసీఆరే బీఆర్ఎస్ బలం, ముచ్చటగా మూడోసారి గెలుపు ఖాయామా ?
ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో సారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా పని చేస్తున్నారు. బీసీలు, దళితులు, ఎస్టీలు, ఉద్యోగులు ఇలా, సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కొత్త కొత్త పథకాలు ప్రకటించారు. ఉద్యోగులకు 5శాతం ఐఆర్, సింగరేణి బొగ్గు కార్మికులకు దసరా బోనస్, అన్నదాతలకు రైతుబంధు, లక్ష వరకు రుణ మాఫీ వంటి పథకాలతో ప్రజల్లో తిరుగులేని బలాన్ని సంపాదించుకున్నారు సీఎం కేసీఆర్. అందుకే పొత్తుల్లేని పోరుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత  జరిగే మూడో అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆరే. తెలంగాణపై పూర్తి అవగాహన ఉంది. ప్రజల నాడి కేసీఆర్ కు తెలిసినంతగా, ప్రస్తుతం తెలంగాణలోని ఏ నేతలకు లేదు. పూర్తి వివరాలు


తెలంగాణ హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఊరట- ఎన్నిక చెల్లదన్న పిటిషన్ డిస్మిస్‌
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్‌ హైకోర్టు కొట్టేసింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల చెల్లదంటూ 2019లో మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు దాఖలు చేసిన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. శ్రీనివాస్ గౌడ్ 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చారంటూ రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. పూర్తి వివరాలు



సీఐడీ విచారణకు లోకేశ్- కేసు విచారణ టీంలో అధికారి మార్పు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణలో భాగంగా తాడేపల్లి సమీపంలోని పాతూరు రోడ్డులోని సిట్ కార్యాలయానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకూ సీఐడీ ఆయన్ను విచారించనుంది. విచారణాధికారి జయరామ్ రాజ్ బృందం ఆధ్వర్యంలో లోకేశ్ ను విచారించనున్నారు.  ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పుపై లోకేశ్ ను విచారించేందుకు సీఐడీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్ ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించి మళ్లీ వెనక్కు తీసుకుని సవరించి అందజేశారని పేర్కొన్నారు. పూర్తి వివరాలు


చంద్రబాబు అరెస్టుపై జగన్ కామెంట్స్‌కి కారణమేంటీ? భయమా? వ్యూహమా?
చంద్రబాబుపై ఎలాంటి కక్ష లేదు. నేను ఏపీలో లేని టైంలోనే చంద్రబాబును పోలీసులు లోపలేశారు. ఇది తాజా చంద్రబాబు అరెస్టుపై ఏపీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ హాట్‌ టాపిక్‌గా మారాయి. మొన్నటికి మొన్న నిడదవోలులో జరిగిన బహిరంగ సభలో తీవ్ర విమర్శలు చేసిన జగన్ ఒక్కసారిగా టోన్ మార్చడానికి కారణం ఏంటీ? నిజంగా జగన్ ఆత్మరక్షణలో పడ్డారా లేకుంటే దీనికి వేరే కారణం ఏమైనా ఉందా? జగన్ రాజకీయం గమనిస్తే ప్రతి మాటలో, చేసే పని వెనుక పెద్ద ప్లానే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు విషయంలో కూడా అదే ఉందనే టాక్ వైసీపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు లాంటి బలమైన రాజకీయ నాయకుడిని జైలుకు పంపించేంత సాహసం చేయరు. పూర్తి వివరాలు