Crime News: తిరుపతి (Tirupati Latest News)నగరానికి నిత్యం లక్షలాదిమంది భక్తులు, ఇతర రాష్ట్రాల ప్రయాణికులు, పర్యాటకులు వస్తుంటారు. వాళ్లనే టార్గెట్‌ చేస్తూ బస్టాండ్, రైల్వే స్టేషన్‌లో చోరీలకు పాల్పడే వ్యక్తితో పాటు మొబైల్‌ ఫోన్‌ దుకాణదారులను పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనం చేసే వారితోపాటు చోరీ సొత్తు కొన్న వాళ్లు కూడా కేసుల్లో ఇరుక్కుంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 


తిరుపతి భగత్ సింగ్ కాలనీకి చెందిన శ్రీనివాసులు తన సెల్ ఫోన్ చోరీకి గురైందని ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తిరుపతిలోని చింతలచేను వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. వెంటనే పట్టుకున్న పోలీసులు ప్రశ్నించారు. 


అన్నమయ్య జిల్లా(Annamayya District Latest News) పుల్లంపేట మండలం కొట్టాలపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు మల్లికార్జున (36)గా గుర్తించారు. అతడు బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో చోరీలకు పాల్పడుతున్నట్టు తేలింది. నిద్రపోతున్న ప్రయాణికుల నుంచి సెల్ ఫోన్లు చోరీ చేస్తున్నాడు. ఆ సెల్ ఫోన్లను రిపేర్ షాప్ వాళ్ళకు అమ్ముతుంటాడు. అలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుంటాడు. ఇలా దొంగతనం చేసి అమ్మకాలు చేసిన సుమారు 5 లక్షల విలువైన 32 సెల్ ఫోన్లు పోలీసులు రికవరీ చేశారు. 


సెల్ ఫోన్ బిల్లు లేకుండా లాక్ ఓపెన్ చేసి కొనుగోలు చేసిన తిరుపతి కి చెందిన 5 మంది షాపు యజమానులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఎవరైన ఇలా బిల్లులు లేకుండా లాక్ ఓపెన్ చేయడం, బిల్లు లేకుండా కొనుగోలు చేయడం, అమ్మకాలు చేయడం, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం చేయడం నేరమని, అలా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


Also Read: అమ్మవారి శ్లోకాలు చదువుతుండగా గొలుసు లాక్కెళ్లాడు - బెంగుళూరులో ఘటన, షాకింగ్ వీడియో


కర్ణాటక మద్యం స్వాధీనం..
కర్ణాటక రాష్ట్రం(Karnataka Latest News) నుంచి మద్యం కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh Latest News)కు తీసుకొచ్చి అమ్మకాలు సాగిస్తున్న వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు(Chittoor Latest News) మండలం నగిరిపల్లి గ్రామం నుంచి కన్నికాపురం గ్రామం వైపుగా అనుమానాస్పదంగా వస్తున్న టాటా ఇండికాను తనిఖీ చేశారు. కారులో కర్ణాటక మద్యం ఉందని గుర్తించారు. సుమారు 45వేలు విలువైన 720 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం చిక్కబల్లాపూర్ గౌరీబిడనూర్‌కు చెందిన శివ కుమార్ ను అరెస్టు చేశారు. డబ్బుకు ఆశపడి కర్ణాటక రాష్ట్రం నుంచి మద్యం తీసుకొచ్చి ఏపీలో అమ్మకాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. కారును, మద్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.


మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి జరిమానా
చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 21 మందిని పట్టుకున్నారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఉమాదేవి ముందు వారిని ప్రవేశ పెట్టగా 21 మందికి 10వేలు చొప్పున జరిమానా విధించారు.


Also Read: అదృశ్యమైన బాలిక కేసు విషాదాంతం, గోనె సంచిలో మృతదేహం లభ్యం