టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం రమ్య కుటుంబాన్ని పరామర్శించారు. బీటెక్ విద్యార్థిని రమ్య ఆదివారం తాడేపల్లిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోకేశ్ గుంటూరు వచ్చి ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ హాయాంలో సాధారణ మహిళలకు భద్రత ఎక్కడుందని ప్రశ్నించారు. ఇటీవలే వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి తనకు ప్రాణ గండం ఉందని చెప్పడాన్ని లోకేశ్ ప్రస్తావించారు. సీఎం జగన్ చెల్లెలైన సునీతా రెడ్డికే రక్షణ లేనప్పుడు సామాన్య మహిళలకు రాష్ట్రంలో భద్రత ఎక్కడుందని నిలదీశారు. రమ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడంతో నారా లోకేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Also Read: Weather Updates: నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లోనే..


‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు స్వాతంత్య్రం పోవడం బాధాకరం. గన్ కంటే ముందు జగన్ వస్తాడు అని బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు జగన్ రావడం లేదు గన్ను రావడం లేదు. మధ్యాహ్నం కూడా పడుకుంటున్నాడు జగన్ రెడ్డి గారు.. రమ్య హత్య జరిగిన 12 గంటల తరువాత సీఎం ట్వీట్ పెట్టారంటే మహిళల భద్రత పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్ధమవుతుంది. నిన్న హోంమంత్రి గారు మహిళల్ని హత్య చేసే హక్కెవరిచ్చారు అని అమాయకంగా అడుగుతున్నారు. ఆ మాట విన్న తరువాత నవ్వాలో, ఏడవాలో అర్ధం కావడం లేదు. మహిళల్ని హత్య చేసే హక్కు సీఎం జగన్ రెడ్డి గారే ఇచ్చారమ్మా సుచరిత గారు...’’ అంటూ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.


Watch: Guntur Crime: గుంటూరు బీటెక్ విద్యార్థిని హత్య సీసీ కెమెరా దృశ్యాలు


Watch: Pawan Kalyan: ప్రజల సొమ్ముతో పెట్టే పథకాలకు సీఎంల పేర్లా?.. త్యాగధనులు కనిపించరా..? పంద్రాగస్టు స్పీచ్‌లో పవన్ పంచ్‌లు


జగన్ రెడ్డి గారి ఇంట్లో మహిళలకు రక్షణ లేదు.. ఇంటి పక్కన మహిళలకు రక్షణ లేదు.. సొంత నియోజకవర్గంలో మహిళకు రక్షణ లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెల్లెలు నాకు ఈ రాష్ట్రంలో రక్షణ లేదు అని చెప్పడం చరిత్రలో ఎప్పుడైనా చూసామా? జగన్ రెడ్డి గారి చెల్లి వైఎస్ సునీతా రెడ్డి నాకు ప్రాణ భయం ఉంది.. రక్షణ కల్పించండి అని అడుగుతున్నారు. ఇక ఈ రాష్ట్రంలో సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? సొంత చెల్లికే రక్షణ కల్పించలేని వాడు రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తాడు? జగన్ రెడ్డి గారి ప్యాలెస్ పక్కన మహిళ‌పై అత్యాచారం జరిగితే ఈ రోజు వరకూ నిందితులను పట్టుకోలేకపోయారు. జగన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మని అత్యంత కిరాతకంగా చంపేస్తే ఈ రోజు వరకూ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు.’’ అని నారా లోకేశ్ మాట్లాడారు. 


Also Read: Ramya Murder: రమ్య మృతదేహం తరలింపు అడ్డగింత.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు, ఫ్యామిలీకి నగదు చెక్కు అందించిన హోంమత్రి