ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇటీవల ప్రమాదకర డెల్టా ప్లస్ వేరియంట్ మరణాలు సైతం నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 11,81,212 (11 లక్షల 81 వేల 212) శాంపిల్స్‌కు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 32,937 మందికి కొవిడ్19 పాజిటివ్‌గా తేలింది. నిన్నటితో పోల్చితే దాదాపు 3 వేల వరకు పాజిటివ్ కేసులు తగ్గాయి.


మెరుగ్గా కరోనా రికవరీ రేటు..
అదే సమయంలో మరో 417 మంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకూ కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 4,31,642 (4 లక్షల 31 వేల 642)కు చేరుకుంది. వరుసగా రెండోరోజు కరోనా పాజిటివ్ కేసుల కంటే కొవిడ్19 నుంచి కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉంది. నిన్న ఒక్కరోజులో 35,909 మంది కరోనా మహమ్మారని జయించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 3,14,11,924 (3 కోట్ల 14 లక్షలు)కు చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,81,947 ఉన్నాయి. నిన్నటితో పోల్చితే దాదాపు 4 వేల మేర యాక్టివ్ కేసులు తగ్గాయి. మొత్తం కేసులలో ఇవి 1.19 శాతమని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. కరోనా రికవరీ రేటు 97.48 శాతానికి చేరుకుంది.
Also Read: 335 మందితో డేటింగ్.. స్ఫూర్తి నింపుతున్న యువకుడి డేరింగ్ స్టెప్, మరో 30 మందిని కలిస్తే.. 


దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. జనవరిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. నిన్నటివరకూ మొత్తం 54,58,57,108 డోసుల కరోనా టీకాలు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. మొత్తంగా పంపిణీ చేసిన వ్యాక్సిన్ల డోసులు 56.81 కోట్లు రాష్ట్రాలకు చేరాయి. వీటితో 2.89 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద నిల్వ ఉన్నాయి. అతిపెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో కరోనా తీవ్రత తక్కువగా ఉండటంతో.. తాజా కేసులలో పెరుగుదల వ్యత్యాసం అంత ఎక్కువగా లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Diabetes: మధుమేహాన్ని నియంత్రించడంలో ఇదే మంచి ఫుడ్ అంటున్న అధ్యయనాలు, ఆరోగ్యనిపుణులు


కేరళ, మహారాష్ట్రలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసులలో దాదాపు సగం వరకు కేరళ నుంచే రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఫోకస్ చేసింది. రాష్ట్రంలో గత రెండు, మూడు నెలలుగా వీకెండ్ లాక్‌డౌన్‌తో కరోనా కట్టడకి చర్యలు తీసుకుంటున్నారు. కరోనా కేసులు తగ్గడంతో ముంబైలో ఓపెన్ గార్డెన్స్, బీచ్‌లు, మైదానాలు తెరుచుకోనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు ఆంక్షలు ఎత్తివేసినట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. కరోనా కేసులు తగ్గడంతో ముంబైలో ఓపెన్ గార్డెన్స్, బీచ్‌లు, మైదానాలు తెరుచుకోనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు ఆంక్షలు ఎత్తివేసినట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. అసోంలో తాజాగా 411 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 10 మంది చనిపోగా, మొత్తం కరోనా మరణాలు రాష్ట్రంలో 5,492కు చేరుకున్నాయి.
Also Read: Pregnancy tips: పిల్లలు పుట్టడం లేదా? ఇలా చేస్తే.. తప్పకుండా గుడ్ న్యూస్ వింటారు!