Guntur Crime: గుంటూరు బీటెక్ విద్యార్థిని హత్య సీసీ కెమెరా దృశ్యాలు

గుంటూరులో ఘోరం జరిగింది. కఠిన చట్టాలు అమలు చేస్తోన్న మహిళలపై దాడులు మాత్రం ఆగడంలేదు. గుంటూరులోని పరమాయికుంట వద్ద టిఫిన్ తీసుకెళ్లేందుకు​వచ్చిన ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనతో గుంటూరు ఉలిక్కిపడింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గుంటూరు పెదకాకాని రోడ్డులోని పరమాయికుంటలో టిఫిన్ తీసుకెళ్లేందుకు వచ్చిన యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులో ఉన్న బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తోండగా మార్గమధ్యలో చనిపోయింది. యువతిపై కత్తితో దాడి చేస్తున్న సమయంలో అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ దుండగుడు స్థానికులను కత్తితో బెదిరించి ద్విచక్రవాహనంపై పరారయ్యాడు.

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola