తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడుతోందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులు కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురవవచ్చని అంచనా వేశారు.


Also Read: Dalit Bandhu Scheme: దళిత బంధుపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇవ్వబోయి అంతమాట అనేశారే..!


ఈ జిల్లాల్లోనే అతిభారీ వర్షాలు
ఆగస్టు 15 రాత్రివేళ హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. ఆగస్టు 16న తెలంగాణలో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ గ్రామీణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. కరీంనగర్, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ పట్టణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించి ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేశారు. ఇక మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు.


Also Read: Petrol-Diesel Price, 16 August: పెట్రోల్, డీజిల్ రేట్లలో స్వల్ప హెచ్చుతగ్గులు.. ఇక్కడ భారీ తగ్గుదల, తాజా ధరలివీ..


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా..
పశ్చిమ మధ్య బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతిలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేశారు.


ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే విధంగా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాయలసీమ జిల్లాలు మినహా మిగతా అన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసేటట్లుగా అంచనా వేశారు. భారీ వర్షం ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.


Also Read: Gold-Silver Price: బంగారం ధరలో అతి స్వల్ప పెరుగుదల.. నిలకడగా వెండి ట్రేడింగ్.. ఇవాల్టి ధరలివే..


Also Read: Karate Kalyani Joins BJP: బీజేపీలోకి కరాటే కల్యాణి, కేసీఆర్ ఆ డబ్బు బరాబర్ ఇవ్వాల.. బండి సంజయ్ డిమాండ్