శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి దేవాలయాన్ని కూలగొడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అయ్యాయి. టీడీపీ, జనసేన పార్టీలు కూడా ఈ పోస్టులను తమ ఖాతాల్లో పోస్టు చేశాయి. ఈ పోస్టులపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రచారం అవుతున్నారని స్పష్టం చేసింది. అలాగే నీలమణి దుర్గ అమ్మవారి దేవాలయ అధికారులు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
నష్టపరిహారం చెల్లింపు
రైల్వే ఫ్లైఓవర్ పనుల్లో భాగంగా దేవాలయం ప్రహరీ గోడ, దేవాలయం ముందుభాగంలో గల ఆర్చ్‌ను తొలిగించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. స్థానిక తహసీల్దార్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ఆర్ అండ్ బీ, డీఈఈలతో పాటు పోలీసుల సమక్షంలో దేవాలయానికి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకున్నట్లు ఓ ప్రకటన జారీ చేశారు. దీనికి గాను ఒక కోటి నలభై లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల నాలుగు రూపాయలను దేవాలయానికి నష్టపరిహారం మంజూరు అయినట్లు తెలిపారు.
పత్రికా ప్రకటన జారీ చేసిన అధికారులు
ఫ్లైఓవర్ పనులు పూర్తైన తర్వాత ఫ్లై ఓవర్ కాంట్రాక్టర్‌తో ఆలయ నిర్మాణాలు చేయిస్తామని అధికారులు తెలిపారు. నీలమణి అమ్మవారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అక్టోబరు 23న పత్రికా ప్రకటన కూడా జారీ చేశారు. కానీ సామాజిక మాధ్యమాల్లో అమ్మవారి ఆలయాన్ని కూల్చివేస్తున్నారని వీడియో వైరల్ అయ్యాయి. వీటిపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం వాస్తవాలను వివరించింది. అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించింది.
Also Read: మీ కలల్ని మించిన ధనవంతులు అవ్వండి.. అందుకు నిజంగా ఏం చేయొద్దు, పూర్తి వివరాలివీ..
Also Read: అగ్గిపెట్టెల ధర పెంపు.. 14 ఏళ్ల తర్వాత రెట్టింపైన రేటు, కారణం ఏంటంటే.