సస్పెన్షన్ కాలం రెండేళ్లు జీతం ఇవ్వకపోతే మరోసారి న్యాయపోరాటం చేస్తానని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటించారు. ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన తన విధుల్లో చేరేందుకు సెక్రటేరియట్‌కు వెళ్లారు. ప్రభుత్వం ఆదేశించిన విధంగా సాధారణ పరిపాలనా శాఖలో తన జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. అయితే జీఎడీలో తన కంటే జూనియర్లు ఉన్నారని.. సివిల్ సర్వీస్ సంప్రదాయాల ప్రకారం సీనియర్లకే రిపోర్ట్ చేయాలని .. సీఎస్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ మాత్రం ఆయనను కలిసేందుకు ఇష్టపడలేదు. దీంతో ఆయన పీఏకు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు.  ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.


సీఎం జగన్ పది రోజుల విదేశీ టూర్ - వైఎస్ఆర్‌సీపీ నేతలకు ఫుల్ హోం వర్క్ !


మూడేళ్ల నుంచి తన  మీద ఎలాంటి కేసులు నిరూపించలేకపోయారని ఏబీవీ స్పష్టం చేశారు.  మూడేళ్ళ నుంచి ఏం పీక్కున్నారు .. మూడేళ్ళ నుంచి ఏమీ తేల్చలేకపోయారన్నారు. తానును ఎలా పనిచేశానో అందరికి తెలుసన్నారు. సజ్జల తనపై మీడియాలో బురద జల్లడం ఎంతవరకూ కరెక్ట్? అని ప్రస్నించారు.  విధి నిర్వహణలో నిబద్దత తో పని చేశానని ఆ సమయంలో  టీడీపీ నేతలు కూడా తన పై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారన్నారు. తా ఏమి చేసినా చట్టానికి లోబడే పని చేశానన్నారు.  సీఎస్ ఉద్దేశపూర్వకంగానే నాకు అపోయింట్మెంట్ ఇవ్వడం లేదని.. రెండేళ్ల సస్పెన్షన్ ను సర్వీస్ గా పరిగణించాలని సీఎస్ ను అడుగుదామనుకున్నాన్నారు.  రెండేళ్ల జీతం ఇవ్వకుంటే హైకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు.  సీఎస్ పదవీ కాలం ఆరునెలలు పొడిగించారని..తనకు మాత్రం ఇంకా రెండేళ్ల సర్వీస్ ఉదన్నారు. తనకు పోస్టింగ్  ఇవ్వకపోతే ప్రజాధనం వృధా అవుతుందన్నారు. 


అనంత టీడీపీకి అసలైన సమస్య సొంత నేతలే ! చంద్రబాబు చక్కదిద్దగలరా ?


 గతంలో ఇలా ప్రెస్ మీట్ పెట్టినందుకు ఏపీ సీఎస్ ఆయనకు నోటీసులు పంపారు. ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలన్నారు. ఏబీవీ కూడా దీనికి రిప్లయ్ ఇచ్చారు. తన హక్కుల మేరకే ప్రెస్ మీట్ పెట్టాన్నారు. ఇప్పుడు కూడా ఏబీ వెంకటేశ్వర రావు ప్రెస్ మీట్ పెట్టడంతో మళ్లీ నోటీసులు ఏమైనా జారీ చేస్తారా అన్న చర్చ అధికారవర్గాల్లో జరుగుతోంది. అయితే ఏబీవీకి పోస్టింగ్ ఇచ్చే ఉద్దేశంలో ప్రభుత్వం లేదని ఆయనను ఖాళీగానే ఉంచుతారని చెబుతున్నారు.