Stock Market Opening Bell: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) గురువారం భారీగా నష్టపోయాయి. ఆరంభం నుంచే అమ్మకాల వెల్లువ కొనసాగింది. ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లను తెగనమ్ముతున్నారు. అమెరికా, జపాన్‌, చైనా, సింగపూర్‌ మార్కెట్లు తీవ్రంగా నష్టపోవడంతో మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఐటీ షేర్ల పతనం అందరినీ కలవరపరుస్తోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 15,809 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 1416 పాయింట్ల వరకు నష్టపోయింది. ఇన్వెస్టర్లు దాదాపుగా రూ.7 లక్షల కోట్ల వరకు నష్టపోయారు.


BSE Sensex


క్రితం సెషన్లో 54,208 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 53,070 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 52,669 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఉదయం నుంచే అమ్మకాల వెల్లువతో సూచీ నేల చూపులు చూస్తోంది. 53,356 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 1416 పాయింట్ల నష్టంతో 52,792 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


బుధవారం 16,240 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 15,917 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే నష్టాల బాట పట్టింది. 15,775 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,984 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 430 పాయింట్లు నష్టపోయి 15,809 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ముగిసింది. ఉదయం 33,461 వద్ద మొదలైంది. 33,180 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,633 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 848 పాయింట్ల నష్టంతో 33,315 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 3 కంపెనీలు లాభాల్లో 47 నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, ఇన్ఫీ, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా 5 శాతానికి పైగా నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. ఐటీ సూచీ మాత్రం 4-5 శాతం వరకు పతనమైంది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ 2 శాతం వరకు నష్టపోయింది.