Stock Market Opening Bell: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) గురువారం భారీ నష్టాల్లో మొదలయ్యాయి. ఆరంభం నుంచే అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లను తెగనమ్ముతున్నారు. అమెరికా, జపాన్‌, చైనా, సింగపూర్‌ మార్కెట్లు తీవ్రంగా నష్టపోవడంతో మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ముఖ్యంగా ఐటీ షేర్ల పతనం కలవరపరుస్తోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 15,940 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 100 పాయింట్ల వరకు నష్టాల్లో ఉంది. ఇన్వెస్టర్లు దాదాపుగా రూ.5 లక్షల కోట్ల వరకు నష్టపోయారు.


BSE Sensex


క్రితం సెషన్లో 54,208 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 53,070 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 53,053 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఉదయం నుంచే అమ్మకాల వెల్లువతో సూచీ నేల చూపులు చూస్తోంది. 53,356 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 100 పాయింట్ల నష్టంతో 53,220 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


బుధవారం 16,240 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 15,917 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే నష్టాల బాట పట్టింది. 15,903 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,984 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 300 పాయింట్లు నష్టపోయి 15,940 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 33,461 వద్ద మొదలైంది. 33,387 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,633 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 645 పాయింట్ల నష్టంతో 33,515 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 2 కంపెనీలు లాభాల్లో 48 నష్టాల్లో ఉన్నాయి. ఐటీసీ, ఐచర్‌ మోటార్స్‌ లాభాల్లో ఉన్నాయి. టెక్‌ మహీంద్రా, ఇన్ఫీ, విప్రో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌ 4 శాతం వరకు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఐటీ, ఆటో, మెటల్‌, బ్యాంకింగ్‌ స్టాక్స్‌ను ఇన్వెస్టర్లు తెగనమ్ముతున్నారు. పతనం ఇంకా కొనసాగే అవకాశం ఉంది.