Stock Market Closing Bell: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒడుదొడుకుల్లోనే సూచీలు కదలాడాయి. ఎకానమీలో ఇంకా స్థిరత్వం లేకపోవడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,240 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 109 పాయింట్లు నష్టపోయింది. 


BSE Sensex


క్రితం సెషన్లో 54,318 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 54,554 వద్ద లాభాల్లో మొదలైంది. 54,130 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఉదయం నుంచే కొనుగోళ్ల మద్దతు లభించడంతో 54,784 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. భారీగా లాభపడ్డ సూచీ చివరికి 109 పాయింట్ల నష్టంతో 54,208 వద్ద ముగిసింది.


NSE Nifty


మంగళవారం 16,284 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 16,318 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే లాభాల బాట పట్టింది. అయితే 16,211 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. జోరుగా కొనుగోళ్లు సాగడంతో 16,399 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా  2.85 పాయింట్లు నష్టపోయి 16,240 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 34,448 వద్ద మొదలైంది. 34,134 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,655 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 138 పాయింట్ల నష్టంతో 34,163 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ముగిశాయి. టాటా కన్జూమర్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, శ్రీసెమ్‌, అదానీ పోర్ట్స్‌ లాభపడ్డాయి. పవర్‌ గ్రిడ్‌, బీపీసీఎల్‌, టెక్‌ మహీంద్రా, అపోలో హాస్పిటల్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగంలో కొనుగోళ్ల సందడి కనిపించింది. బ్యాంక్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, రియాల్టీ, ఐటీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు నష్టపోయాయి.