ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో జరగనున్నప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్తున్నారు. మరో వారం రోజుల పాటు వ్యక్తిగత పర్యటనలో ఉండనున్నారు. తాను పది రోజుల పాటు లేకపోతే పార్టీ నేతలు రిలాక్స్ అవుతారని అనుకున్నారేమో కానీ అందరికీ పది రోజులు సరిపడా హోంవర్క్ రెడీ చేసి పెట్టారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా అందరి దృష్టి మహానాడుపైనే ఉంటుంది. అందుకే సీఎం జగన్ వైఎస్ఆర్‌సీపీ నేతల కోసం బస్ యాత్రను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. 


తాను దేశంలోలేని  సమయంలో పార్టీ , ప్ర‌భుత్వం నెమ్మది అయిపోకుండా  ప్ర‌త్యేకంగా ఏర్పాట్లు చేశార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.  ఈ నెల 27,28 తేదీల్లో టీడీపీ మ‌హానాడు నిర్వ‌హిస్తుంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వంలోని ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, మంత్రులతో ప్ర‌త్యేకంగా బ‌స్సు యాత్ర‌కు వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ చేసింది. మ‌హానాడు ఒక రోజు ముందు మెద‌ల‌య్యే బ‌స్సు యాత్ర మ‌హానాడు ముసిగిన మ‌రుస‌టి రోజు వ‌ర‌కు కంటిన్యూ అవుతుంది. మ‌హానాడు జ‌రిగే రెండు రోజులు మీడియాతో పాటుగా సోష‌ల్ మీడియా దృష్టి అంతా టీడీపీ వైపే ఉంటుంది..ఒక రోజు ముందు,త‌రువాత అంటే దాదాపు నాలుగు రోజుల పాటు టీడీపీ,పైనే మీడియా ఫోక‌స్ అంతా ఉంటుంది. ఇదే స‌మ‌యంలో సీఎం కూడ విదేశాల్లో ఉంటారు. అంటే దాదాపుగా ప్రచారం అంతా ప్ర‌దాన ప్ర‌తిప‌క్షం వైపు ఉంటుంది. అందుకే  పొలిటిక‌ల్ గా మహానాడు మాత్రమే కాదు మంత్రుల బస్ యాత్ర కూడా మీడియా కవరేజీలో చోటు దక్కించుకునేందుకు వ్యూహం సిద్ధం చేశారన్నమాట. 


ఇప్ప‌టికే వైసీపీ గ‌డ‌ప‌...గ‌డ‌ప కు మ‌న ప్ర‌భుత్వం పేరుతో ఇంటింటికి వెళుతోంది. దీంతో పాటే ఇప్పుడు బ‌స్సు యాత్ర‌కు ప్లాన్ చేయ‌టం వెనుక రాజ‌కీయ వ్యూహం క‌న్నా, ప‌బ్లిసిటి వ్యూహ‌మే అధిక‌మ‌ని భావిస్తున్నారు.  వైఎస్ఆర్‌సీపీ నేత‌లు కూడా ఈ విష‌యంలో త‌మ‌కు తామే సెట‌ైర్లు వేసుకుంటున్నారు. సీఎం విదేశాల్లో ప‌ది రోజులు ఉంటారు కాబ‌ట్టి ఆ స‌మ‌యంలో రాష్ట్రంలో నాయ‌కులు రిలాక్స్ అవ‌కుండా హోం వ‌ర్క్ ఇచ్చి వెళుతున్నార‌ని అంటున్నారు. 


టీడీపీ మ‌హానాడు జరుగుతూండగా వైఎస్ఆర్‌సీపీ నేతల బస్సు యాత్ర మాత్రమే కాదు బీజేపీ కూడా యాక్టివ్ అయింది. బీజేపి నేత‌లు కూడా ప‌నిలో ప‌నిగా 26వ తేదీన నెల్లూరులో  రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ నెల చివరి వారంలో ఏపీలో రాజకీయ పార్టీలన్నీ చాలా బిజీగా ఉంటున్నాయి.