Special Trains for Sabarimala | హైదరాబాద్: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఏపీ, తెలంగాణలో వేర్వేరు చోట్ల నుంచి శబరిమలకు మొత్తం 26 అదనపు రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South central Railway) తెలిపింది. శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
మచిలీపట్నం - కొల్లాం మార్గంలో రైళ్లు
మచిలీపట్నం - కొల్లాం మధ్య (రైలు నెం.07145) నవంబర్ 18, నవంబర్ 25, డిసెంబర్ 2, 9, 16 తేదీల్లో ప్రయాణిస్తుంది. అదే విధంగా కొల్లాం- మచిలీపట్నం (రైలు నెం. 07146) మార్గంలో నవంబర్ 20, 27 తేదీలతో పాటు డిసెంబర్ 4, 11, 18 తేదీలో మొత్తం 12 సర్వీసులు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తెలిపింది. వీటితోపాటు నవంబర్ 23వ తేదీ, 30 తేదీన మచిలీపట్నం- కొల్లాం (రైలు నెం. 07147) నడవనున్నాయి. అదే రైళ్లు తిరుగు ప్రయాణంలో నవంబర్ 25వ తేదీన, డిసెంబర్ 1న రైలు నెం. 07148 నడపున్నట్లు ద. మ. రైల్వే ఎక్స్ ఖాతాలో తెలిపింది.
హైదరాబాద్ - కొల్లాం మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు
హైదరాబాద్ లోని మౌలాలి - కొల్లాం మధ్య (రైలు నెం. 07143) నవంబర్ 22న, 29 డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో సర్వీసులు నడవనున్నాయి. వీటితో పాటు కొల్లాం నుంచి హైదరాబాద్ లోని మౌలాలి మధ్య (రైలు నెం. 07144) నవంబర్ 24, డిసెంబర్ 1న, 8, 15, 22, 29న మొత్తం 12 సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. రైలు ఏ సమయంలో బయలుదేరనుంది, ఏ సమయంలో ఏ స్టేషన్ చేరుకోవాలి అనేది ఫొటోలో వివరాలు చెక్ చేసుకోండి.
Also Read: Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
ఈ ఏడాది విమాన మార్గంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప మాల ధరించిన భక్తులకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. భక్తులు ఇరుముడిని క్యాబిన్ చెకిన్ పూర్తయ్యాక విమానంలోకి తీసుకెళ్లవచ్చు అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో అయ్యప్ప మాల ధరించే వారి సంఖ్య ఎక్కువ అని, భక్తుల ఇబ్బందిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.