Top News today on November 19 from Andhra Pradessh and Hyderabad in Telangana - మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల డబుల్ గేమ్ - టీడీపీతో సఖ్యతకే ప్రాధాన్యం ఇస్తున్నారా ?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో పదకొండు మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని .. అది ఇచ్చే వరకూ సభకు వచ్చేది లేదని వైసీపీ సభాపక్ష నేత జగన్ ప్రకటించారు. దాంతో అసెంబ్లీలో విపక్షం లేకుండా పోయింది. కానీ శాసనమండలిలో మాత్రం ఆ పార్టీకి మెజార్టీ ఉంది. బొత్స సత్యనారాయణకు ప్రతిపక్ష నేత హోదా ఉంది. శాసనసభలో కాకకపోయినా శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తారని ఆశించిన ఆ పార్టీ క్యాడర్ కు జరుగుతున్న పరిణామాలు మింగుడు పడటం లేదు. పూర్తి వివరాలు


తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడు గొలుగూరి సత్యనారాయణపై బీఆర్‌ఎస్ ఈడీకి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఈడీ కేసుల్లో ఆ ఫ్యామిలీని ఇరకాటంలో పెట్టి రేవంత్‌ను టార్గెట్ చేయాలని చూస్తోంది. లగచర్లలో మొదలైన వివాదం ఇప్పుడు మరో మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ సేకరించే భూములు ఆయన ఆల్లుడి కోసమే అని ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్‌ వివాదంలోకి ఈడీని లాగేందుకు ఫిర్యాదుల చేస్తోంది.  పూర్తి వివరాలు


తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి పెద్ద చిక్కు వచ్చి పడింది. తమ రాజకీయం తాము చేస్తున్నా ఏదో ఒక పార్టీకి అంటగట్టేందుకు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. దీంతో తెలంగాణ బీజేపీకి పెద్ద చిక్కు వచ్చి పడింది. జైలుకు పోవాల్సిన రేవంత్ ను బీజేపీ కాపాడుతోందని కేటీఆర్ అంటున్నారు. అదే మాటను కాంగ్రెస్ అంటోంది. అవినీతి చేసి అడ్డంగా దొరికిన కేటీఆర్ గురించి ఆధారాలతో సహా గవర్నర్ ముందు పెట్టినా అరెస్టుకు పర్మిషన్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ అంటోంది. పూర్తి వివరాలు


KGBV విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ఘటనపై ప్రభుత్వం సీరియస్- బాధ్యులపై చర్యలకు ఆదేశం
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ఘటన సంచలనంగా మారుతోంది. దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్ అయినట్టు సమాచారం. వెంటనే విచారణ చేపట్టి చర్యలకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రతిజ్ఞకు హాజరు కాలేదని ప్రత్యేకాధికారిణి సాయి ప్రసన్న విద్యార్థినుల జుట్టు కత్తిరించారు. 23 మంది విద్యార్థులు కాలేజీకి ఆలస్యంగా వచ్చారు. వీరిపై ప్రత్యేకాధికారి సాయి ప్రసన్న, మరో ఉపాధ్యాయురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చేయి చేసుకున్నారు.  పూర్తి వివరాలు


తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. పాలన పూర్తి చేసుకుంటున్న తొలి ఏడాదిలోనే విపక్షం నుంచి పూర్తి స్థాయి ఎదురుదాడిని ఎదుర్కొంటున్నారు. కలసి రావాల్సిన రాజకీయ నిర్ణయాలు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. మొదట మంచి ఫలితాలు ఇచ్చిన హైడ్రా వంటి నిర్ణయాలపై తర్వాత వెనక్కి తగ్గాల్సి వచ్చింది. నిజానికి సీఎం అన్ని పకడ్బందీ నిర్ణయాలు తీసుకున్నారని కానీ ఎగ్జిక్యూషన్‌లోనే ఎక్కడో తేడా వచ్చిందని కాంగ్రెస్ వర్గాలనుకుంటున్నాయి.  పూర్తి వివరాలు