Telangana secretariat gate change:  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. పాలన పూర్తి చేసుకుంటున్న తొలి ఏడాదిలోనే విపక్షం నుంచి పూర్తి స్థాయి ఎదురుదాడిని ఎదుర్కొంటున్నారు. కలసి రావాల్సిన రాజకీయ నిర్ణయాలు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. మొదట మంచి ఫలితాలు ఇచ్చిన హైడ్రా వంటి నిర్ణయాలపై తర్వాత వెనక్కి తగ్గాల్సి వచ్చింది. నిజానికి సీఎం అన్ని పకడ్బందీ నిర్ణయాలు తీసుకున్నారని కానీ ఎగ్జిక్యూషన్‌లోనే ఎక్కడో తేడా వచ్చిందని కాంగ్రెస్ వర్గాలనుకుంటున్నాయి. కాలం కలసి రావాంటే కొన్ని మార్పులు చేయాలని అనుకుంటున్నాయి. ఇదే  విషయం రేవంత్‌కు కూడా అనిపించిదేమో కానీ పాలనా భవనం సెక్రటేరియట్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు. 


బాహుబలి గేట్ తొలగింపు 


బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎంతో ముచ్చడపడి కట్టించిన సెక్రటేరియట్‌ నుంచి రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. గతంలో అక్కడ  ఉండే ఏడు పెద్ద భవనాలను కూల్చేసి.. చెట్లు అన్నీ తీసేసి విశాలమైన ప్రదేశంగా మార్చి అక్కడ సెక్రటేరియట్ కట్టారు. సచివాలయం నాలుగు వైపులా నాలుగు గేట్స్ ఉన్నాయి. అయితే లుంబిని పార్క్‌కు  ఎదురుగా గతంలో ప్రధాన గేటు ఉంటే చోట.. మళ్లీ ప్రధాన ద్వారం నిర్మించారు. దీన్నిబాహుబలి గేట్‌ పిలుస్తూ ఉంటారు.  ఇపుడా  గేట్ క్లోజ్ చేయించి కొత్త గేటు ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం దాదాపుగా రూ. మూడు కోట్లు ఖర్చు చేస్తున్నారు. మాములుగా అయితే ఆ గేటుతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ గేటు నుంచే సీఎం రాకపోకలు సాగిస్తున్నారు. కానీ ఎందుకో కానీ ఇప్పుడా గేటునుక్లోజ్ చేయిస్తున్నారు. 


Also Read:  వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు


వాస్తు మార్పులే కారణం ? 
 
సహజంగా ఇలాంటి మార్పులు వాస్తు దోషాల కారణంగానే  రాజకీయ నేతలు చేస్తూంటారు. ముఖ్యమంత్రికి ఆ గేటు నుంచి  రాకపోకలు సాగించడం వల్ల సమస్యలు వస్తున్నాయని అనుకోవడం వల్లనే మారుస్తున్నారని అంచనా వేస్తున్నారు. లేకపోతే  ఆ గేటు భవనానికి వాస్తు పరంగా బాగోలేదని అనుకోవడం వల్ల మార్పు చేయాలని నిర్ణయించినట్లుగా భావిస్తున్నారు. నిజానికి కేసీఆర్ అసలు అక్కడ సెక్రటేరియట్ కట్టాలనుకోలేదు. సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్ దగ్గర నుంచి చాలా చూశారు. ఏదీ వర్కవుట్ కాకపోవడంతో చివరికి ఇప్పుడు ఉన్న స్థలంలో ఉన్న వాటిని కూల్చేసి కొత్తవి కట్టించారు. ఇక్కడా వాస్తు సమస్యలు ఉన్నాయని మొదటి నుంచి కొన్ని విశ్లేషణలు ఉన్నాయి. 


Also Read: Ghost News: 2 నెలల్లో 30 మంది మృతి, గ్రామానికి దెయ్యం పట్టిందని వణికిపోతున్న ప్రజలు - వీడిన మిస్టరీ


తెలంగాణ తల్లి విగ్రహం కోసమే మార్పులన్న కోమటిరెడ్డి ! 


కేసీఆర్ సచివాలయం కట్టించారు కానీ పూర్తి స్థాయిలో సీఎంగా అందులో విధులు నిర్వహించలేకపోయారు. రేవంత్ పూర్తి స్థాయిలో సచివాలయాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఆయనకు వరుసగా సమస్యలు వస్తున్నాయి. చాలా సులువుగా నెరవేరాల్సిన పనులు కూడా వివాదాస్పదం  అవుతున్నాయి.   సమస్యల పరిష్కారం కోసం పండితుల నుంచి వచ్చిన సలహా మేరకు గేట్లను మార్చాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే మంత్రి కోమటిరెడ్డి మాత్రం.. వాస్తు కారణాలతో గేటును మార్చడం లేదని.. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కారణంగానే మారుస్తున్నామని అంటున్నారు.