Both KTR and Revanth are criticizing Telangana BJP: తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి పెద్ద చిక్కు వచ్చి పడింది. తమ రాజకీయం తాము చేస్తున్నా ఏదో ఒక పార్టీకి అంటగట్టేందుకు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. దీంతో తెలంగాణ బీజేపీకి పెద్ద చిక్కు వచ్చి పడింది. జైలుకు పోవాల్సిన రేవంత్ ను బీజేపీ కాపాడుతోందని కేటీఆర్ అంటున్నారు. అదే మాటను కాంగ్రెస్ అంటోంది. అవినీతి చేసి అడ్డంగా దొరికిన కేటీఆర్ గురించి ఆధారాలతో సహా గవర్నర్ ముందు పెట్టినా అరెస్టుకు పర్మిషన్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ అంటోంది. ఈ ఇద్దరి ఆరోపణల మధ్య బీజేపీ నలిగిపోతోంది.
కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ పర్మిషన్ ఇవ్వడం లేదంటున్న కాంగ్రెస్ నేతలు
ఫార్ములా ఈ రేసు విషయంలో రూ. 55 కోట్లు లెక్కా పత్రం లేకుండా విదేశీ కంపెనీకి తరలించారని ఏసీబీ కేసు పెట్టింది. ఈ కేసులో కేటీఆర్ విచారణకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ తెలంగాణ గవర్నర్‌కు లేఖ రాసింది. కానీ గవర్నర్ నుంచి ఇంత వరకూ పర్మిషన్ రాలేదు. కాంగ్రెస్ నేతలు గవర్నర్ ఏదో ఏసీబీకి పర్మిషన్ ఇచ్చి ఉంటే ఈ పాటికి అరెస్టు అయి ఉండేవారని కానీ ఆ పర్మిషన్ గవర్నర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి బీజేపీ తో డీల్ కుదుర్చుకుని వచ్చారని అంటున్నారు. గవర్నర్ అనుమతి రాగానే చర్యలు తీసుకోవడం ఖాయమని సీఎం రేవంత్ కూడా ప్రకటించారు. కానీ గవర్నర్ వద్ద నుంచి ఇంకా సమాచారం లేదు.
రేవంత్ ను బీజేపీనే కాపాడుతోందంటున్న కేటీఆర్
కేటీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లారు. అమృత్ టెండర్ల మీద ఫిర్యాదు చేశారు. ఇక అరెస్టే మిగిలిందని అంటున్నారు . అవినీతి జరిగిపోయిందని కాబట్టి.. ఇక అరెస్టు చేయడం బీజేపీ బాధ్యత అని చేయడం లేదు కాబట్టి రేవంత్ రెడ్డిని బీజేపీ కాపాడుతున్నట్లేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేటీఆర్ నేరుగా ట్వీట్లు పెడుతున్నారు. మరో వైపు లగచర్ల ఘటన జరుగుతున్న సమయంలో కిషన్ రెడ్డి మూసి నిద్ర చేపట్టడాన్ని కూడా కేటీఆర్ తప్పు పడుతున్నారు. టాపిక్ డైవర్షన్ కోసం .. రేవంత్ కు సహకరిచేందుకు ఆయన మూసి నిద్ర చేపట్టారని.. రేవంత్ కోసం ఇలా చేస్తున్నారని..ఆయనను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
Also Read: Hyderabad Tourism News: వీకెండ్‌లో రామప్ప, లక్కవరం టూర్- తెలంగాణ పర్యాటక శాఖ స్పెషల్ ప్యాకేజీ
ఈ ఆరోపణలపై బీజేపీ తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి తంటాల పడుతోంది. రెండు పార్టీలు కలిసి బీజేపీనే బ్లేమ్ చేస్తున్నాయి. బండి సంజయ్ లాంటి బీజేపీ నేతలు మాత్రం... నిరూపించాలని సవాళ్లు చేస్తున్నారు. రేవంత్, కేటీఆర్ మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని.. వారిద్దరూ ఇప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రులేనని బండి సంజయ్ అంటున్నారు. ఎవరికి వారు ఇలా మిగతా రెండు పార్టీలు కలిసిపోయాయని అంటున్నారు. కానీ హోరాహోరీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ తలపడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి కానీ ఎప్పట్లాగే బీజేపీ ధర్డ్ పార్టీగా ఉండిపోతోంది.దాంతో నిజంగానే మేము ఇద్దర్నీ కాపాడుతున్నామా అని ఆ పార్టీ క్యాడర్ కూడా ముందూ వెనుకా చూసుకుంటున్నారు. బీజేపీకి పూర్తి స్థాయి అధ్యక్షుడు లేకపోవడం వల్ల ఆ పార్టీ పరిస్థితి ఇంకా ట్రాక్ మీదకు రాలేదు.