Weekend Tour In Warangal : హైదరాబాద్(Hyderabad)లో ఉంటున్న వాళ్లకు వీకెండ్ వచ్చింది అనేది ఎటు వెళ్దామా అని చూసే గూగుల్(Google)లో సెర్చ్ చేస్తుంటారు. గంటల ప్రయాణం, ట్రాన్స్‌పోర్టు అనుకూలంగా ఉండే ప్రాంతాలను వెతుకుతుంటారు. అలాంటి వారి కోసం తెలంగాణ పర్యాటక శాఖ(Telangana Tourism Department) హ్యాపీ న్యూస్ చెప్పింది. వరంగల్(Warangal)లోని రామప్ప సహా కీలకమైన పర్యాటక ప్రదేశాలను చూసి వచ్చేందుకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.
ప్రపంచ చారిత్రక ప్రదేశంగా పేరు పొందిన రామప్పకు మరింతగా ప్రాచుర్యం కల్పించేందుకు ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ములుగు జిల్లాలోని పాలంపేట్‌లో ఉన్న రామప్ప ఆలయాన్ని సందర్శించి అక్కడ పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వీలుగా ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది. ప్రతి శనివారం హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభంకానుంది. ఆదివారం సాయంత్రానికి తిరిగిపయనం అవుతుంది.
హైదరాబాద్‌లోని యాత్రి నివాస్‌లో ఉదయం 6.30 గంటలకు టూర్ స్టార్ అవుతుంది. రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం కూడా వివిధ ప్రాంతాలు తిరుగుతారు. ఆదివారం రాత్రి 9 గంటలకు తిరిగి వస్తుంది. టూర్ ప్యాకేజీలో భాగంగా భద్రకాళి, పద్మాక్షి, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం సందర్శించవచ్చు. పెద్దలకు రూ.3449, పిల్లలకు రూ.2759 ప్యాకేజీగా నిర్ణయించారు.
ఏసీ మినీ బస్‌లో తీసుకెళ్తారు. టూర్ ఎలా సాగుతుంది అంటే:-
- 7:00 AM:-సికింద్రా బాద్‌లోని యాత్రినివాస్ వద్ద బస్ బయల్దేరుతుంది.
- 8:30 AM :- భువనగిరి కోటకు చేరుకుంటుంది.
- 9:00 AM :-యాదగిరి గుట్ట వద్ద హరిత హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్
- 9:45 AM :- యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దర్శనం
- 10:30 AM :- యాదగిరి గుట్ట నుంచి ప్రయాణం మొదలు
- 11:00 AM to 11:30 AM :- దగ్గరలో ఉన్న జైన్ టెంపుల్ సందర్శన
- 12:00:- పెంబర్తిలో షాపింక్ కోసం కాస్త విరామం
- 1:30 PM:- హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌కు రాక
- 1:30 PM to 4:00 PM:- హోటల్‌కు రావడం చెక్‌ఇన్ అవ్వడం కాస్త విశ్రాంతి
- 4:00 PM to 8:30 PM :- వెయి స్తంభాల గుడి సందర్శన, భద్రకాళి టెంపుల్ దర్శనం, వరంగల్ కోట విజిట్, అక్కడ లైటింగ్ షో వీక్షణ
- 9:00 PM:- హోటల్‌కు వచ్చి డిన్నర్ చేసి బస చేయడం
Also Read: శ్రీరాం సాగర్ వద్ద కొత్త టూరిజం స్పాట్- ఆకట్టుకోనున్న బోటింగ్, రోప్‌వే
ఆదివారం తిరిగే ప్రాంతాలు
- 8:00 AM:- ఉదయం హరిత హోటల్‌లో ప్రారంభం,(కేవలం ఆదివారం టూర్ కోసం వరంగల్ ప్రజలు కూడా జాయిన్ కావచ్చు)
- 10:00 AM to 1:00 PM :- రామప్ప టెంపుల్ సందర్శన, అక్కడే బోటింగ్, లంచ్ కూడా ఉంటుంది.
- 2:00 PM 3:00 PM:- లక్కవరం సరస్సు సందర్శన అక్కడ బోటింగ్ ఉంటుంది.
- 3:00 PM:- లక్కవరం నుంచి తిరుగుపయనం
- 3:20 PM to 3:35 PM:- జంగపల్లి వద్ద టీ బ్రేక్
- 5:00 PM:- హన్మకొండ హోటల్‌కు రాక స్నాక్స్ తిని తిరుగుపయనానికి రెడీ అవ్వడం
- 5:30 PM:- తిరుగు పయనం మొదలు
- 9:00 PM:- సికింద్రాబాద్‌లోని యాత్రినివాస్‌కు చేరుకుంటారు.
కాకతీయ రాజవంశం పాలనలో 13వ శతాబ్దంలో నిర్మాణం రామప్ప దేవాలయం 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్ప దేవాలయం అద్భుతమైన ఇంజినీరింగ్‌కు ప్రసిద్ధిగా చెబుతారు. పైకప్పులో తేలియాడే ఇటుకలు ఉపయోగించారు. స్తంభాలు, పైకప్పులు గోడలపై ఉన్న శిల్పాలు భారతీయ పురాణాలు, కాకతీయుల జీవితం, ఆ యుగానికి చెందిన ప్రముఖుల జీవిత చరిత్రను వివరిస్తాయి.
Also Read: మూతపడ్డ సింగరేణి బొగ్గు గనికి టూరిజం సొగసులు!