Karimnagar News: పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ మూతపడ్డ బొగ్గు గనిని టూరిజం స్పాట్ గా రూపుదిద్దుతున్నారు. మూతపడిన జీడీకే 7 ఎల్ఈపీ గనిని సింగరేణి అధికారులు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు సింగరేణి టూరిజం ప్యాకేజీని టీఎస్ ఆర్టీసీ ప్రవేశ పెట్టడంతో ఈనెల 27 నుంచే పర్యాటకులు ఇక్కడకు రానున్నట్లు తెలుస్తోంది. సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ 3 ఏరియా జీఎంలు కె.నారాయణ, ఎం.మనోహర్, టి.వెంకటేశ్వర రావుతో కలిసి 7 ఎల్ఈపీ గనిని సందర్శించారు. సంస్థ సీఎండి శ్రీధర్ ఆదేశాల మేరకు టూరిస్ట్ లను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి బొగ్గు గనులు అంటే అందరికీ తెలిసినప్పటికీ భూగర్భంలోకి కార్మికులు ఎలా వెళ్తారు. ఉత్పత్తి ఎలా తీస్తారు, రక్షణ చర్యలు ఎలా ఉంటాయి.. వంటి అనేక సందేహాలను టూరిస్టులకు నివృత్తి చేసేలా సింగరేణి చర్యలు తీసుకుంటుంది.


దేశంలోనే మొదటి సారిగా సింగరేణి సహకారంతో ఆర్టీసీ టూరిజం ప్యాకేజీ సిద్దం చేస్తోంది. ఇటీవల రామగుండంకు వచ్చిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీ-2 ఏరియాలోని వాకీల్ పల్లి గనిని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. బొగ్గు గనులు ఇక్కడి ప్రాజెక్టులతో కలిపి ఆర్టీసీ టూరిజం ప్యాకేజీ చేస్తే బాగుంటుందని ప్రకటించిన ఆయన ప్యాకేజీకి సహకరించాలని సింగరేణికి లేఖ రాశారు. సింగరేణి బొగ్గు గని ఓసీపీ పవర్ ప్లాంట్ తో పాటు రాబోయే రోజుల్లో పార్వతీ బ్యారేజీ కాళేశ్వరంలోని ముక్తేశ్వరాలయం, కాలేశ్వరం ప్రాజెక్టు వంటి పర్యాటక స్థలాలను పొందుపరచనున్నట్లు చెప్పారు. ఈ మేరకు సీఎండి శ్రీధర్ కు లేఖ రాయడంతో టూరిజం ప్యాకేజీ పనుల్లో వేగం పెరిగింది. హైదరాబాద్ బస్సు భవన్ నుంచి ముగ్గురు, కొత్తగూడెం సింగరేణి కార్పోరేట్ కార్యాలయం నుంచి ముగ్గురు అధికారులు వచ్చి పర్యాటక గని ఓసీపీ 3 ప్లాస్టింగ్ చూపించే ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. దీన్ని బట్టి మార్పులు  చేసే అవకాశం ఉంది. పర్యాటకులు ఎక్కువ సేపు గడిపేలా జీడికే 7 ఎల్ఈపి గనిని సుందరీకరించినన్నారు. దానిపై ఆహ్లాదభరితమైన పార్కు, పర్యాటకులు సేదతీరెందుకు షెల్టర్ ఏర్పాటు చేయనున్నారు. క్యాంటీన్ ప్రారంభిoచి ఫుడ్ ఐటమ్స్ సమకూర్చానున్నారు. 


గనిలోని పని స్థలాల్లో వెంటిలేషన్, లైటింగ్ తో పాటు గనిపై అత్యాధునిక వష్రూమ్స్ నిర్మించనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరే టూరిస్టులు మార్గ మధ్యంలో లోయర్ మానేరు డ్యామ్ సందర్శిస్తారు. అక్కడి నుంచి జీడీకే 7 ఎల్ఈపీ గనికి చేరుకుంటారు. సింగరేణి పనితీరు బొగ్గు ఉత్పత్తి కార్మికుల సంక్షేమం రక్షణ చర్లపై ప్రజెంటేషన్ తిలకిస్తారు. యైటీంక్లైన్ కాలనీలోని మెయిన్ రెస్క్యూ స్టేషన్ ను సందర్శిస్తారు. అక్కడ లంచ్ చేసిన తర్వాత ఓసీపీ 3 వ్యూ పాయింట్ నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు ఓసీపీ 3 లో జరిగే బ్లాస్టింగ్ చూపిస్తారు. అక్కడి నుంచి సింగరేణి థర్మల్ ప్లాంట్ కు తీసుకెళ్లి విద్యుత్ ఉత్పత్తి తీరును వివరిస్తారు. ఇలా పర్యాటకులకు కనువిందు చేసే విధంగా ఆర్టీసీ ప్యాకేజీ రూపొందిస్తోంది. జీడీకే 7 ఎల్ఈపీ గనిలో మ్యాన్ రైడింగ్ చైర్ లిఫ్ట్ ద్వారా టూరిస్ట్ లు 400 మీటర్ల లోతున వరకు వెళ్తారు. బొగ్గు పొరలు, రక్షణ వివరాలు వివరిస్తారు. ఓసీపీ 3 లో జరిగే బ్లాస్టింగ్ ను ప్రత్యక్షంగా చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు తీసుకెళ్లి విద్యుత్ ఉత్పత్తి ఎలా జరుగుతుందో వివరిస్తారు. భవిష్యత్ తరాలకు చరిత్రత్మక కోల్ మైన్ ప్రస్థానాన్ని ఈ రకంగా అందించనున్నారు.