ఢిల్లీలోనే ముఖ్యమంత్రి కేసిఆర్- పలువురు నేతలతో భేటీ.
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోని పలువురు నేతలతో భేటీ అవుతున్నారు. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంతో, అదేవిధంగా దేశవ్యాప్త కార్యాచరణ, కార్యవర్గ ఏర్పాటు పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎవరైతే బీఆర్ఎస్‌లో చేరడానికి ఆసక్తి చెబుతున్నారు. వారితో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం ఆయన తిరిగి హైదరాబాద్ వస్తారని సమాచారం.
నేడు పాలేరు నియోజక వర్గ YSRTP కార్యాలయానికి భూమి పూజ
పాలేరులో వైఎస్ఆర్టీపీ పోటీ దాదాపు ఖాయమైంది. అక్కడ నుంచి షర్మిల అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు మరోసారి ప్రకటించనున్నారు. దీని కోసం గత కొన్ని రోజుల పార్టీ కార్యాలయానికి స్థలాన్ని పరిశీలించారు. ఎట్టకేలకు స్థలం దొరకడంతో నేడు అక్కడ పార్టీ కార్యాలయ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం వై.ఎస్. షర్మిల భూమి పూజ నిర్వహించనున్నారు. ఖమ్మం రూరల్ మండలం కరుణ గిరి చర్చ్ సమీపంలో పార్టీ కార్యాలయ నిర్మాణం జరగనుంది. వై.ఎస్.షర్మిల ఉదయం 11.30గంటలకు భూమి పూజ చేస్తారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరు కానున్న పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని పార్టీ పిలుపునిచ్చింది.
నేడు బీజేపీ పదాధికారుల సమావేశం
రైతు రుణమాఫీ, ధరణీ సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ ఛార్జ్ ల సమావేశంలో కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ హాజరుకానున్నారు.
నేటి నుంచి జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు
రాష్ట్రంలోని 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు https://www. tspsc.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో 27 సబ్జెక్టుల్లో.. మల్టీజోన్-1లో 724, మల్టీ జోన్-2లో 668 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించి ఈ నెల 9న నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. వచ్చే సంవత్సరం జూన్ లేదా జూలైలో పరీక్ష నిర్వహించనున్నది.
డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తులు షురూ
రాష్ట్రంలోని 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి శుక్రవారం నుంచి జనవరి 5 వరకు https://www.tspsc.gov.in ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నేటి నుంచి యాదాద్రిలో ధనుర్మాస ఉత్సవాలు.. వచ్చే నెల 15 వరకు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నేడు ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం సాయంత్రం 6.17 గంటలకు ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. జనవరి 15 వరకు నెలరోజులపాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. సంక్రాతి పండుగకు ముందు చేపట్టే ధనుర్మాసోత్సవాల్లో గోదాదేవి మనోవల్లభుడైన శ్రీరంగనాథుడిని ఆరాధించే పర్వాలు నిర్వహిస్తారు.
ప్రతిరోజు ఉదయం 4.30 గంటలకు శ్రీ ఆండాల్ అమ్మవారికి ఉత్సవ సేవ నిర్వహించనున్నారు. ఉదయం 4.30 నుంచి 5.15 గంటల వరకు ఆలయ ముఖమండపంపైన ఉత్తర భాగంలోని హాల్‌లో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం జరిపించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా జనవరి 14న రాత్రి 7 గంటలకు గోదా కల్యాణం, 15న ఉదయం 11.30 గంటలకు ఒడి బియ్యం సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తారు.
నేడు క్రిస్మస్ వేడుకలు
క్రిస్మస్ పండుగ సందర్భంగా హైదరాబాదులో ముందస్తు వేడుకలు పలుచోట్ల జరుగుతున్నాయి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని అనేక చోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఉదయం 10:15 నిమిషాలకు క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కారున్నాయి దీనికి ప్రముఖ రెడ్డి సిరి హనుమంతు హాజరుకానున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మధ్యంతర పిటిషన్ పై నేడు విచారణ
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సిబిఐ అప్పగించాలంటూ హైకోర్టులో దాఖలైన అన్ని పిసిన్ పై గురువారం వాదన సాయి అన్ని పక్షాల వాదన హైకోర్టు తీర్పును వాయిదా వేసింది ఈ కేసును దర్యాప్తును సిబిఐ లేదా హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక బృందానికి అప్పగించాలంటూ బిజెపి ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తో పాటు నిందితులు దాఖలు చేసిన పిటిషన్ లపై విచారణ చేపట్టారు. ఈ కేసులో చాలామంది మధ్యంతర పిటీషన్ దాఖలు చేశారు వారు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే ఈరోజు చెప్పాలని స్పష్టం చేశారు.