Love Horoscope Today 16th December 2022: ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...

మేష రాశికుటుంబ సభ్యులు తమ ప్రేయసిని పరిచయం చేస్తారు. పెళ్లి దిశగా అడుగులేస్తారు. వైవాహిక జీవితంలో ఇద్దరి మధ్యా సమన్వయం ఉంటుంది. ఏదైనా విషయంలో మీ జీవిత భాగస్వామిని ఒప్పించడంలో సక్సెస్ అవుతారు. 

వృషభ రాశి ఈ రోజు మీ భాగస్వామికి మీకు మధ్య దూరం పెరుగుతుంది..దీంతో ఏదో నిరాశలో ఉంటారు. వైవాహిక జీవితంలో  సంఘర్షణలు ఉంటాయి. సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుంటారు. బంధాలను మీరు సీరియస్ గా తీసుకోవాలి

మిథున రాశి మీకు ప్రియమైన భాగస్వామి సేవలో ఉంటారు. వారి మాటతీరుతో ఇబ్బంది పడతారు. ఈ రోజు బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అనవసర కార్యకలాపాలకు దూరంగా ఉండడం మంచిది. 

Also Read: ఆ ఒక్క విషయంలో తప్ప 2023 బాగా కలిసొస్తుంది, కన్యారాశి వార్షిక ఫలితాలు

కర్కాటక రాశికొత్త స్నేహితులు మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు..కొత్త బంధాలు ఏర్పడతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. మీ ప్రేమ భాగస్వామి మీపై కోపంగా ఉండొచ్చు. మీరు ఓ అడుగు తగ్గడం మంచిది.

సింహ రాశిప్రేమికులు తమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకోవచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తారు.  వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

కన్యా రాశిఈ రోజు మీకు చాలా మంచి రోజు. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి. మీ మనసైన వారితో మీరు నమ్మకంగా వ్యవహరించండి. బంధాలు చాలా సున్నితమైనవి అని గుర్తించండి. 

తులా రాశి ఈ రోజు పాత స్నేహితులను, ప్రేమికులను కలుస్తారు. ప్రేమ జీవితంలో పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేసుకుంటారు. వైవాహిక జీవితంలో ఇప్పటికే ఏదైనా సమస్య ఉంటే అది తీరుతుంది.

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

వృశ్చిక రాశి ఈ రోజు వివాహ సంబంధం లేదా నిశ్చితార్థం ఉండవచ్చు. ఒంటరిగా ఉన్న వ్యక్తులు జీవిత భాగస్వామిని పొందవచ్చు. మీరు మీ స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. భార్య ఆరోగ్యం క్షీణిస్తుంది. 

ధనుస్సు  రాశిప్రేమలో సక్సెస్ అయ్యేందుకు స్నేహితుల నుంచి సలహాలు తీసుకోవచ్చు. కుటుంబంలో అనదపు బాధ్యత పెరుగుతుంది. మీ జీవితంలో కుటుంబ సభ్యుల జోక్యం పెరుగుతుంది. బ్యాలెన్స్ చేసుకోవడం రాకపోతే ఇబ్బంది పడతారు.

మకర రాశి ప్రేమికులు తమ కుటుంబాలనుంచి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పొందుతారు. భార్యాభర్ల మధ్య సామరస్యం జీవితంలో సమతుల్యతను తెస్తుంది. భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. కొంతమంది తప్పు వ్యక్తులు ప్రేమ పేరుతో మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది.

కుంభ రాశిప్రేమికులకు వారి వారి కుటుంబాల నుంచి ఇబ్బందులు తప్పవు. ఓ అపరిచిత వ్యక్తి మీ జీవితంలోకి రావొచ్చు. పాత స్నేహితులు కలవాలని మిమ్మల్ని పట్టుబడతారు. అవివాహితుల వివాహం ఆలస్యం కావచ్చు.

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

మీన రాశి ఈ రాశివారి జీవితభాగస్వామి ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. మీ తెలివితేటలు, అప్రమత్తత కారణంగా మీ ప్రేమికుడి కుటుంబం మిమ్మల్ని ఇష్టపడుతుంది. జీవిత భాగస్వామితో గొడవలు పెట్టుకోవద్దు. భార్య ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి