ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచ్‌లు ఆందోళనకు దిగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ( Central Governament Funds )  ఇచ్చిన నిధులను పంచాయతీల ఖాతా నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంపై సర్పంచ్‌లు ( Surpanch ) అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను తక్షణం పంచాయతీలకు జమ చేయాలని డిమాండ్ చేస్తూ  తాడేపల్లిలోని ( Tadepalli ) పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని సర్పంచుల సంఘం ముట్టడించింది. తాడేపల్లిలోని కార్యాలయంలో ఉన్న అసిస్టెంట్ కమిషనర్‌ను.. సర్పంచ్‌ల సంఘం ప్రతినిధులు నిర్బంధించారు. పంచాయతీలకు రావల్సిన రూ.7 వేల కోట్ల నిధులను ఇతర పథకాలకు మళ్లించారని తక్షణం వాటిని విడుదల చేయాలని అక్కడే బైఠాయించారు.  


కియాకు భీమ్లా షాక్ - ఉద్యోగుల మూకుమ్మడి లీవ్ ! సెలవు ఇచ్చేసిన కంపెనీ


సర్పంచులకు తెలియకుండా వారి అకౌంట్ల నుంచి నిధులు మళ్లించడం  కరెక్ట్ కాదన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ , ప్రస్తుతం సర్పంచ్‌ల సంఘం గౌరవాధ్యక్షుడిగా ఉన్న రాజేంద్రప్రసాద్ ( Babu Rajendra Prasad ) ఆధ్వర్యంలో సర్పంచ్‌లు ఈ నిరసన చేపట్టారు. మెరుపు నిరసన చేపట్టడం...  కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.  తలుపులు తోసుకుని లోపలికి ప్రవేశించి ఆందోళన చేస్తున్న సర్పంచ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో సర్పంచ్‌లు వాగ్వాదానికి దిగారు. రాజేంద్రప్రసాద్ తో ( Rajendra Prasad ) పాటు అందోళనకారులను అదుపులోకి తీసుకున్న తాడేపల్లి పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తరలించారు. నిధుల విషయంలో సర్పంచ్‌లు కొంత కాలంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. 


ఉండవల్లితో బ్రదర్ అనిల్ భేటీ ! ఎందుకంటే ?


పంచాయతీల్లో చిన్న చిన్న పనులు చేయడానికి కూడా అవకాశం ఉండటం లేదని నిధుల కొరత కారణంగా గ్రామస్తుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారంటున్నారు. వేసవి ( Summer ) వస్తున్న సమయంలో మంచి నీటి పథకాలకు ( Drinking Water ) మరమ్మతులు చేయించలేకపోతూండటంతో నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఏర్పడింది. ఈ కారణంగా ప్రభుత్వం వెనక్కి తీసుకున్న నిధులు ఇవ్వాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. ప్రత్యేక ఖాతాలు తెరిస్తే నిధులు ఇస్తామన్న ప్రభుత్వం అలా తెరిచినా నిధులు జమ చేయలేదు. దీంతో సర్పంచ్‌లు ఆందోళన బాట పడుతున్నారు. 


ఉక్రెయిన్ నుంచి తెలంగాణ వారిని రప్పించండి, ఖర్చులు మేమే భరిస్తాం - విదేశాంగ మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి