Andhra Pradesh Floods: ఆప‌ద‌లో ఆప‌న్న హ‌స్తం అందివ్వ‌డంలో తూర్పు గోదావ‌రి ప్ర‌జ‌లు ఎప్పుడూ ముందుంటార‌ని నిరూపించుకున్నారు.. విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద‌ల వ‌ల్ల రెండు రోజులుగా ఆహారం లేక ఇబ్బందులు ప‌డుతున్న క్ర‌మంలో వారికి తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి ఆహారం త‌యారు చేసి అందించేందుకు అధికారులు ద్వారా అనేక మంది ముందుకు వ‌స్తున్నారు. జిల్లా నుంచి రెండో రోజు స‌హాయక చ‌ర్య‌ల్లో భాగంగా 1,09,500 ఫుడ్ ప్యాకెట్లు సిద్దం చేసి పంపించిన అధికారులు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ఆహారాన్ని త‌యారు చేయిస్తున్నారు. ఉద‌యం అల్పాహారం 14 వాహనాల ద్వారా 40 వేల ప్యాకెట్లు పంపించ‌గా మ‌ధ్య‌ాహ్నం భోజ‌నం కోసం ఉద‌యం 20 వాహనాల ద్వారా 53000 ప్యాకెట్లు భోజ‌నం ప్యాకెట్లు పంపిణీ జ‌రిగింద‌ని జిల్లా యంత్రాంగం తెలిపింది. సాయంత్రం మరో 24 వాహనాలు ద్వారా 56500 ప్యాకెట్లు పంపనున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ పి.ప్ర‌శాంతి వెల్ల‌డించారు. జిల్లాలోని ప‌లు సంస్థ‌లు, వాణిజ్య సంస్థ‌ల ద్వారా ఈ  ఆహారాన్ని సేకరించి పంపించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. 


ఆయా శాఖ‌ల అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో... 
ఈ దాతృత్వ కార్యక్ర‌మాన్ని పూర్తిగా ఆయా శాఖ‌ల అధికారులే ప‌ర్య‌వేక్షిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్, రాజమండ్రి ఆర్డీవో, పౌర సరఫరాలు, జిల్లా సహకార అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, పరిశ్రమలు, వైద్య ఆరోగ్యం, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, రెవిన్యూ, దేవాదాయ తదితర శాఖల అధికారులు పాల్గొని సేకరణ ప్రక్రియను పర్యవేక్షించడం జరిగిందని తెలిపారు. రెండోరోజు కూడా విజయవాడకు ఆహారం, తాగునీరు, బ్రేడ్‌లు, పాలు ,బిస్కెట్స్, తదితరాలు దాతల, కాంట్రాక్టర్లు, వివిధ అసోసియేషన్స్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు సహకారంతో పంపించడం జరిగిందన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, రెవిన్యూ, పౌర సరఫరాల, ఇతర శాఖలు అధికారులు చొరవ తీసుకుని సేకరించడం జరిగిందని ఉన్న‌త అధికారులు తెలిపారు. 


దాతృత్వాన్ని చాటుకుంటున్న సంస్థ‌లు ఇవే... 
తిరుమల స్కూల్స్ పదివేల ప్యాకెట్లు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా 12500 ప్యాకెట్లు, గైడ్ కళాశాల ద్వారా 1500, జిఎస్ఎల్ ద్వారా 2500,  హోటల్ అసోసియేషన్ తరపున 2500 , సినిమా అసోసియేషన్ తరపున 1000 , సినిమా డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ తరపున 1000, ఓ ఎన్ జి సి తరుపున 5000 , అసోసియేషన్ తరపున 2000 , ఇస్కాన్ ఆధ్వర్యంలో 5000 ,  రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు  10000 ఫుడ్ ప్యాకెట్స్, 50,000 బిస్కెట్ ప్యాకెట్లు పంపడం జరిగిందని అధికారులు తెలిపారు.


Also Read: విజయవాడలో వరద బాధితుల్ని అందుకే కలవలేదు - పవన్ కల్యాణ్ క్లారిటీ


అదేవిధంగా ఆదిత్య కాలేజీ 5000 ప్యాకెట్లు, ప్రైవేటు స్కూల్స్ 5000 , ఆర్డీవో రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ల ద్వారా 20000 ప్యాకెట్లు , ఐఎంఏ అసోసియేషన్ 2000 ప్యాకెట్లు, పెట్రోల్ బంక్ అసోసియేషన్ 1500 ప్యాకెట్లు , జిఎస్ఎల్ ప్యాకెట్లు సీసీ వేలువెన్ను 5000 ప్యాకెట్లు , లెనోవా డెంటల్ కాలేజీ ప్యాకెట్లు ఇండస్ట్రీస్ 1500 ప్యాకెట్లు , వెస్ట్ గోనుగుడు ఐఎస్టిఎస్ ఉమెన్ కాలేజీ 1000 ప్యాకెట్లు , హార్లిక్స్ ఫ్యాక్టరీ 7000 ప్యాకెట్లు జిల్లా సహకార సంస్థ అధ్వర్యంలో కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో 2500 ప్యాకెట్లు సేకరించామన్నారు.



ఎస్ ఆర్ కే క్యాటరింగ్ 7000 ప్యాకెట్లు, హోటల్  శ్రీ కేస్ పదివేల ప్యాకెట్లు,  సిహెచ్ వెంకటరమణ కొవ్వూరు 5000, లక్ష్మీ హాసిని క్యాటరింగ్ 3000 , ప్రసాద్ కేటరింగ్ 5000,  రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ 10000 ప్యాకెట్లు సిద్దం చేసి పంపడం జరిగిందని వెల్ల‌డించారు.. 


Also Read: బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం, నేడు ఈ జిల్లాల్లో కుండపోత - ఐఎండీ