కోనసీమలో వర్షాలు కురుస్తు్న్నాయి. భోగి పండుగ రోజైన శుక్రవారం ఉదయం నుంచి మబ్బులతో ఉంది వాతావరణం. సాయంత్రం అయ్యే సరికి ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పండుగ వాతావరణం అంతా ఒక్కసారిగా చెదిరి పోయింది. సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించ తలపెట్టిన కోడిపందేలపై వర్షం  ప్రభావం తీవ్రంగా పడింది. ఇంటి ముంగిట అలంకరించుకున్న రంగవల్లులు అన్ని కూడా వర్షానికి కొట్టుకుపోయాయి.


సంక్రాంతిని పురస్కరించుకొని పలు ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వర్షం ప్రభావంతో ఆగిపోయాయి. ఇక ఈ అకాల వర్షం కానుమ రోజున జరగనున్న జగ్గన్నతోట తీర్థంపై కూడా తీవ్రంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓడలరేవు బీచ్ లో లో నిర్వహించిన కైట్ ఫెస్టివల్ పైనా వర్ష ప్రభావం పడింది. అక్కడకు వచ్చినవారు తిరిగి వెళ్లిపోయారు. సాయంత్రం వరకు జరగాల్సిన కైట్ ఫెస్టివల్ మధ్యాహ్నంతో ముగిసింది. కోడి పందేల బరులు కూడా చిత్తడిగా మారాయి.


అయితే కొన్ని ప్రాంతాల్లో.. వర్షాలు పడినా.. కోడి పందేలు కొనసాగించారు. నిన్నటి వరకూ ప్రచార ఆర్భాటం చేసిన పోలీసులు తీరా కోడి పందేలు అడ్డు చెప్పకపోవడంతో కొంతమంది అలాగే కొనసాగించారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో  కోడిపందేలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.  ముమ్మిడివరం  నియోజక వర్గం నాలుగు మండలాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. కాట్రేనికోన మండలం పళ్ళంకుర్రులోనూ జోరుగానే పందేలు జరిగాయి. 


Also Read: Vijay Devarakonda Supports Chiranjeevi: చిరంజీవికి మద్దతు ప్రకటించిన విజయ్ దేవరకొండ


Also Read: Chiru No More Politics : ఇట్స్ అఫీషియల్.. రాజకీయాలకు చిరంజీవి రిటైర్మెంట్ ! ఓటమి ఒప్పుకున్నట్లేనా ?


Also Read: AP Corona Cases: ఏపీలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా భారీగా నమోదు


Also Read: Chiranjeevi : రాజకీయాల్లో లేను , రాజ్యసభ ఆఫర్ అవాస్తవం ... క్లారిటీ ఇచ్చిన చిరంజీవి


Also Read: Guntur: చంద్రయ్య హత్య కేసులో 8 మంది అరెస్టు.. దాడికి అసలు కారణం ఇదే.. ఎస్పీ ప్రకటన


Also Read: Agri News: మామిడి, దానిమ్మ రైతులకు శుభవార్త చెప్పిన అమెరికా... ఈ నెల నుంచి ఎగుమతులు ప్రారంభం


Also Read: PM Kisan: రైతులకు షాక్ ఇచ్చిన కేంద్రం.. పీఎం కిసాన్ డబ్బులు వెంటనే తిరిగిచ్చేయండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి