Weather Updates In AP and Telangana: ఏపీ, తెలంగాణలో నేడు సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలో తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో వేగంగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా మరో రెండు రోజులు ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. 


గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏపీలో చలి తీవ్రత కాస్త పెరిగింది. కోస్తాంధ్ర, యానాంలో నేటి నుంచి మరో రెండు రోజుల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానాం (పుదుచ్చేరి), పశ్చిమ గోదావరి జిల్లాలలో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.


దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు..
దక్షిణ కోస్తాంధ్రలో నేటి వర్షాలు కురవనున్నాయి. తూర్పు, ఈశాన్య గాలుల ప్రభావం అధికమైతే రెండు రోజులపాటు వానలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తమ ధాన్యం, పంట ఉత్పత్తులను నీటి పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నేడు సైతం తేలికపాటి జల్లులు కురవనున్నాయి.  కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. ఆ మరుసటి రోజు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అత్యల్పంగా కళింగపట్నంలో 19.4 డిగ్రీలు,  నందిగామలో 19.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జంగమేశ్వరపురంలో 19.8 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.






రాయలసీమలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రేపు కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.  రాయలసీమలోని ఆరోగ్యవరంలో 19 డిగ్రీలు, నంద్యాలలో 20.6 డిగ్రీలు, కర్నూలులో 20.1 డిగ్రీలు, తిరుపతిలో 22 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాల నేపథ్యంలో చలి గాలులు వీస్తున్నాయి.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో పలు జిల్లాల్లో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు ఉరుములు, మెరుపులతో తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కొన్ని చోట్ల వడగండ్ల వానలు పడే అవకాశం ఉన్నందున, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Also Read: Bhatti Vikramarka: సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కకి కరోనా పాజిటివ్.. టెస్టులు చేయించుకోవాలని వారికి సూచన


Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే


Also Read: D.Srinivas: కాంగ్రెస్ లోకి ధర్మపురి శ్రీనివాస్ రీ ఎంట్రీ.. 'కారు' దిగి 'చేయి' పట్టుకునేది ఎప్పుడంటే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి