లోక్‌సభ జీవో అవర్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. జీరో అవర్‌లో రఘురామకృష్ణరాజు అమరావతి రైతుల పాదయాత్రకు ఏర్పడుతున్న అడ్డంకులపై ప్రసంగించారు. హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకుంటున్నారని రఘురామ లోక్‌సభ దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన వారిని తీవ్రంగా హింసిస్తున్నారని అన్నారు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమైనా క్షీణించాయి కాబట్టి లో్‌సభలో చెప్పక తప్పడం లేదన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారని ఆరోపించారు.
రఘురామ ప్రసంగిస్తున్న సమయంలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు అడ్డు తగిలారు. రఘురామరాజు చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు.ఆ పార్టీ శాసనసభాపక్ష నేత మిధన్ రెడ్డి రఘురామకృష్ణరాజుపై మండిపడ్డారు. సభలో నిరాధార, అసత్య ఆరోపణలు చేయడం ఏ మాత్రం సరి కాదని.. రఘురామకృష్ణరాజు రాష్ట్రానికి సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తున్నారని మిథున్ రెడ్డి ఖండించారు. రఘురామకృష్ణరాజుపై రెండు సీబీఐ కేసులు నమోదై ఉన్నాయి. ఆయన బ్యాంకులను మోసం చేశారని... వాటి నుంచి బయట పడడం కోసం కేంద్రంలోని అధికార పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
Also Read: కొడికొండ - మేదరమెట్ల హైవేకి గ్రీన్ సిగ్నల్.. పాత ప్రాజెక్టు ప్లాన్ కనుమరుగే..
రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్‌సీపీ నుంచి ఎంపీగా గెల్చిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. కేసుల నుంచి బయట పడడానికి పార్టీ ఫిరాయించే ప్రయత్నం చేస్తున్నారని.. అందుకే రఘురామకృష్ణరాజు మీద ఉన్న కేసులను వీలైనంత త్వరగా తేల్చాలని స్పీకర్ ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఇండ్ భారత్ థర్మల్ పేరుతో ఆయన తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని మిథున్ రెడ్డి కోరారు.
Also Read : ఓటీఎస్ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు.. ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు !
మిథున్ రెడ్డికి రఘురామకృష్ణరాజు కూడా వెంటనే కౌంటర్ ఇచ్చారు. తనపై రెండే సీబీఐ కేసులు ఉన్నాయని మీ నాయకుడిపై వంద కేసులున్నాయని వాటి సంగతి ముందు తేల్చాలన్నారు. ఇద్దరూ వైఎస్ఆర్‌సీపీ ఎంపీలే కావడం.. ఇరువులు ఒకరిపై ఒకరు తమపై ఉన్న కేసులను తేల్చాలని డిమాండ్ చేయడం లోక్‌సభలో ఉన్న ఎంపీలకు ఆసక్తి కలిగించింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి