అనంతపురం జిల్లాలో రోడ్లన్ని నేషనల్ హైవేలుగా మారిపోతున్నాయి. ఇప్పటికే వున్న హైవేలపై ప్రయాణం చేయాలంటే జేబులకు టోల్ పీజుల చిల్లులు పడుతున్నాయి. ఏ రోడ్డెక్కినా టోల్ తలనొప్పిగా మారింది. అయితే ప్రయాణం సాఫీగా సాగాలంటే ఈ మాత్రం బారం తప్పేలా లేదు. గత ప్రభుత్వం హయాంలో అనంతపురం-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే అంచనాలన్నీ పూర్తి అయినప్పటికీ ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక ప్రాధాన్యతలు మారిపోయాయి.


అనంతపురం - అమరావతి హైవే స్థానంలో కొడికొండ - పులివెందుల - మేదరమెట్ల హైవే ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. అవి ఆచరణ రూపంలోకి వచ్చాయి. 332 కిమీ హైవేకి 16 వేల కోట్లు అవసరం అవుతాయిని నేషనల్ హైవే అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే డీపీఆర్ పూర్తయిన నేపథ్యంలో కేవలం టెండర్లు మాత్రమే పెండింగ్లో వున్నాయి. ఈ హైవే వల్ల బెంగళూరు-అమరావతి వెళ్లే వారికి సౌకర్యంగా వుంటుంది.


అయితే, అనంతపురం-అమరావతి హైవే ద్వారా అయితే నాలుగు జిల్లాలను కలుపుతూ సాగుతుంది. ఇది కేవలం పులివెందులను ప్రాధాన్యంగా ప్రభుత్వ పెద్దలు ప్లాన్ చేశారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం కొడికొండ - మేదరమెట్ల హైవే ద్వారా హిందూపురం, కదిరి, పుట్టపర్తి, పులివెందుల ప్రజలకు ఉపయోగకరంగా వుంటుంది. వీటికి అనుబంధంగా ఓడిసి-నల్లమాడ-ముదిగుబ్బ హైవే పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇవే ప్రారంభం అయితే జిల్లాలో ఏ రోడ్డెక్కినా టోల్ ఫీజుల మోత మోగనుంది.


ఇప్పటికే అనంతపురం -రాయదుర్గం హైవే, అనంతపురం-కదిరి హైవే, తాడిపత్రి-గుత్తి హైవే ఇలా ఏ రోడ్ చూసుకొన్న అనంతపురం జిల్లాలో హైవేల బాట పట్టాయి. తాజాగా కొడికొండ-మేదరమెట్ల హైవే పనులు టెండర్ల దశలో వున్నాయి. ఈ హైవే వల్ల అనంతపురం ప్రజలకు రాజధానికి వెళ్లాలంటే ఎక్కువ దూరం అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ హైవే వల్ల బెంగళూరు, టుమకూరు ప్రజలకు ఉపయోగం తప్ప రాయలసీమ ప్రజలకు ఎలాంటి ఉపయోగం వుండదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కేవలం ముఖ్యమంత్రి  సొంత జిల్లా,సొంత ప్రాంతంకే ఉపయోగకరం అన్నఫీలింగ్స్ వ్యక్తం చేస్తున్నారు జిల్లా వాసులు.


అనంతపురం -అమరావతి హైవే వస్తుందని నాటి ప్రభుత్వంలోని పెద్దలు పెద్ద ఎత్తున రోడ్ కు ఇరువైపులా భూములు కొనుగోలు చేశారు. వారిని దెబ్బకొట్టేందుకే ఈ కొత్త హైవే నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఆలోచనలు చేసినట్లు చెప్తున్నారు. కోట్లు పెట్టి కొన్న నాటి ప్రభుత్వంలోని కీలక నేతలు, వ్యాపారులుకు ఈ హైవే నిర్మాణం వల్ల తీరని నష్టం వాటిల్లే అవకాశం వుంది. ఇప్పటికే కోట్లు పెట్టిన నేతలు, వ్యాపారులు తీవ్ర ఆందోళనలో వున్నారు. కొత్త హైవే ప్లాన్ కూడా అధికార పార్టీ నేతలకు ముందే తెలియడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున భూములు కొన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


Also Read: Eatala Rajender: ఈటలకు షాక్.. ఆ భూముల కబ్జా నిజమేనని చెప్పిన కలెక్టర్


Also Read: Karimnagar: కరీంనగర్ లో కరోనా కలకలం... 46 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్


Also Read: Mahabubabad: కూతురి ముందే తండ్రిని కొట్టిన ఖాకీలు.. ప్లీజ్ మా డాడీని కొట్టొద్దంటూ ఏడ్చేసిన చిన్నారి.. వీడియో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి