బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభంలో కన్నా షో ముగిసే సమయం వచ్చేసరికి బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు అందరి చూపూ టాప్ 5 ఎవరనే. ఇప్పటికే టికెట్ టు ఫినాలే రేసులో నెగ్గి శ్రీరామచంద్ర టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు. దీంతో మిగిలిన ఆ నలుగురు ఎవ్వరన్నదే డిస్కషన్. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌస్ లో ఆరుగులు సభ్యులు ఉన్నారు. శ్రీరామచంద్ర, సన్నీ, షణ్ముక్, మానస్, సిరి, కాజల్. వీరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ కాక తప్పదు. అప్పుడు ఫైనల్స్ లో ఐదుగురు నిలుస్తారు. దీంతో ఈ వారం వెళ్లిపోయేదెవరన్నదే ఆసక్తికర చర్చ. ఈ రోజు సోమవారం కావడంతో నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. అయితే ఇప్పటి వరకూ ఓ లెక్క..ఇప్పుడు మరోలెక్క అన్నట్టు ఆఖరి వారం వరకూ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ప్రతి ఇంటి సభ్యుడు ఇద్దర్ని నామినేట్ చేస్తూ వచ్చారు. అయితే ఆఖరి వారం ఎవరి ప్లేస్ ఏంటో వాళ్లే డిసైడ్ చేసుకోవాలన్నారు బిగ్ బాస్. అందుకు సంబంధించిన ప్రోమో ఇక్కడుంది.
అసలు ఆట ఇప్పుడే మొదలవుతోంది అంటూ మొదలైన ప్రోమో... ఒకటి నుంచి ఆరు వరకూ ర్యాంకులను మీరు డిసైడ్ చేసుకుని ఆ నంబర్ల వెనుక నిలబడమని చెప్పారు బిగ్ బాస్. సన్నీని ఇష్టపడే వ్యక్తి సన్నీ ఫస్ట్ ఉండాలనుకుంటారు.... షణ్ను ఇష్టపడే వ్యక్తి షణ్ను ఉండాలనుకుంటారు. నంబర్ వన్ పై తానుంటా అంటూ సన్నీ నవ్వులు పూయించాడు. ఈ సందర్భంగా కాజల్-సన్నీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఒక్కొక్కరం ర్యాంకింగ్స్ ఇద్దాం అని కాజల్ అనగానే... ఎవరికి వాళ్లు ఫ్రెండ్స్ పేర్లు చెప్పుకుంటారు... మరి శ్రీరామ్ సంగతేంటని కామెడీ చేశాడు సన్నీ. ఆ తర్వాత ఇంటి సభ్యులంతా ఎవరు అనుకుంటున్న నంబర్లు వారికి కేటాయించారు. ఓవరాల్ గా తెలిసిన విషయం ఏంటంటే వీజే సన్నీ మొదటి స్థానంలో, రెండో ర్యాంకులో షణ్ముఖ్ జస్వంత్, మూడో స్థానంలో ఆర్జే కాజల్, నాలుగో స్థానంలో శ్రీరామ చంద్ర, ఐదో స్థానంలో మానస్, ఆరో స్థానంలో సిరి హన్మంత్ నిలిచారట. అయితే టాస్క్ తర్వాత బిగ్ బాస్ అందర్నీ నామినేట్ చేసి షాకిచ్చాడట. టికెట్ టు ఫినాలే గెలిచిన శ్రీరామ చంద్ర తప్ప. అంటే ఈ వారం నామినేషన్లో ఉన్న సభ్యులు మానస్, కాజల్, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, సన్నీ. ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారో..టాప్ 5లో నిలిచేదెవరో వెయిట్ అండ్ సీ.