BharataRatna For Pingali :   అజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్న వేళ త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఉధృతంగా వినిపిస్తోంది. ఇంత కాలం ఆయనను పెద్దగా పట్టించుకోలేదని ఇప్పుడైనా సముచిత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇదే అంశంపై స్పందించారు. మన త్రివర్ణ పతాకాన్ని వీక్షించిన మరుక్షణం శరీరం రోమాంచితం కాని భారతీయులు ఉండరంటే అది అతిశయోక్తి కాదని.. అంతటి శక్తి కలిగిన పతాకాన్ని రూపొందించిన స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య చరితార్థుడని వెల్లడించారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలన్నారు. 





జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జీవితంలో ఆసక్తికరమైన అంశాలు



పింగళి వెంకయ్య కుటుంబీకులు కూడా భారతరత్న ఇవ్వాలని కోరుతున్నారు.   పింగళి వెంకయ్య సమర్థతకు తగిన గుర్తింపు రాలేదని ఆయన మనవరాలు సుశీల ఆవేదన వ్యక్తం చేశారు.  జాతీయ పతాక రూపశిల్పి వారుసులుగా గర్విస్తున్నామని, పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరామని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వ తరపున సీఎం జగన్ కూడా కేంద్రానికి గత మార్చిలోనే లేఖ రాశారు. పింగళికి భారతరత్న ఇవ్వాలన్నారు. 


త్రివర్ణ పతాకం ఆవిష్కరించింది అక్కడే - పింగళి వెంకయ్య గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవిగో !


అయితే ఈ డిమాండ్‌పై కేద్ర మంత్రి కిషన్ రెడ్డి భిన్నంగా స్పందించారు. పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు తనకు తెలియదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు.  ఇప్పటి వరకూ భారతరత్న అంశంపై చర్చ జరగలేదని  రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు ఉంటే కమిటీలో చర్చిస్తామన్ని ప్రకటించారు.  


గాంధీజీ మెచ్చిన పతాకం


 త్రివర్ణ పతాకం సర్వమతాలకు ప్రతీక . 1947, జూలై 22న భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ, మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అందుకే భారతజాతికి జాతీయ జెండా రూపొందించిన వ్యక్తిగా పింగళి వెంకయ్య పేరు చిరస్థాయిలో నిలిచిపోయింది. కేవలం జెండా రూపకర్తగానే కాదు...అనేక విభిన్నమైన రంగాల్లో పింగళి వెంకయ్య నిష్ణాతులు. 1906 నుండి 1922 వరకు జాతీయోద్యమాలతో పాటు మునగాల పరగణా నడిగూడెంలో జమీందారు కోరిక మేరకు అక్కడే ఉండి కంబోడియా పత్ రకంపై పరిశోధనలు చేసి పత్తి వెంకయ్యగా పేరు తెచ్చుకున్నారు. జియాలజీలో పట్టభద్రుడైన అతను ఆంధ్రప్రదేశ్‌లో వజ్రాల తవ్వకాలలో రికార్డు సృష్టించాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వెంకయ్య నెల్లూరులో స్థిరపడి నవరత్నాల మీద అనేక పరిశోధక వ్యాసాలు రాశాడు. ఈ అంశంలో భారత ప్రభుత్వ సలహాదారుగా కూడా పనిచేశారు వెంకయ్య.