ఈ మధ్యకాలంలో సినిమా రిలీజ్ డేట్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి. ఒక్కసారి ప్రకటించిన తరువాత మళ్లీ కొత్త డేట్స్ తో పోస్టర్స్ వదులుతూనే ఉన్నారు నిర్మాతలు. కొన్నాళ్లక్రితం విజయ్ దేవరకొండ, సమంత నటిస్తోన్న 'ఖుషి' సినిమాని డిసెంబర్ లో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ సీఎంగా వాయిదా పడబోతున్నట్లు సమాచారం. దాని స్థానంలో అఖిల్ 'ఏజెంట్' సినిమా అదే నెల 23న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 


'ఖుషి' సినిమా ఇంకా బ్యాలెన్స్ ఉంది. 'లైగర్' సినిమా ప్రమోషన్స్ కోసం తిరుగుతున్న విజయ్ దేవరకొండ మరో నెల వరకు అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు. 'ఖుషి' సినిమా షూటింగ్ కొంతభాగమే బ్యాలెన్స్ ఉన్నప్పటిక్కీ.. హడావిడి చేయడం ఇష్టంలేక దాన్ని జనవరి ప్రారంభంలో లేదా రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 


ఇప్పటివరకు ఈ విషయాన్ని కన్ఫర్మ్ గా చెప్పనప్పటికీ.. వాయిదా పడడం ఖాయమనిపిస్తుంది. మరోపక్క ఆగస్టు నుంచి డ్రాప్ అయిన 'ఏజెంట్' సినిమాను డిసెంబర్ లో విడుదల చేయడం బెటర్ అని ఫీల్ అవుతున్నారు అఖిల్ అండ్ కో. నిన్నటినుంచి సినిమా షూటింగ్స్ బంద్ ప్రభావం కూడా ఈ సినిమాలపై పడింది. దసరా నుంచి మొదలుపెడితే 2023 సంక్రాంతి వరకు ఆల్రెడీ లాక్ చేసుకున్న రిలీజెస్ లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ బంద్ త్వరగా ముగిసిపోతే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఎక్కువ రోజులు కొనసాగితే మాత్రం కష్టమే.


Also Read: కొరటాల, బుచ్చిబాబు సినిమాలు - ఎన్టీఆర్ ప్లాన్ ఇదే!


Also Read: జగపతిబాబు వల్ల డబ్బులు పోగొట్టుకున్నా - త్రివిక్రమ్ సినిమా అందుకే వద్దన్నా: వేణు తొట్టెంపూడి