ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోగా సినిమాలు చేశారు వేణు తొట్టెంపూడి(Venu Thottempudi). ఆయన కెరీర్ లో చాలా హిట్స్ ఉన్నాయి. అయితే కొన్నాళ్లుగా ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. చాలా కాలం తరువాత ఇప్పుడు మళ్లీ 'రామారావు ఆన్ డ్యూటీ'(Ramarao On Duty) అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు వేణు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నటుడు జగపతిబాబు(Jagapathi Babu) కారణంగా డబ్బులు పోగొట్టుకున్నానని, త్రివిక్రమ్(Trivikram) సినిమా ఛాన్స్ వద్దన్నానని ఇలా చాలా విషయాలను చెప్పుకొచ్చారు. 


జగపతిబాబు వల్ల డబ్బులు పోగొట్టుకున్నా:  
''జగపతిబాబు గారితో మంచి రిలేషన్ ఉండేది. ఆయనతో కలిసి 'హనుమాన్ జంక్షన్', 'ఖుషీ ఖుషీగా' ఇలా కొన్ని సినిమాలు చేశారు. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే మా ఇద్దరి మధ్య చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాని కారణంగా నేను ఆర్థికంగా నష్టపోయాను. ఆ విషయాన్ని చర్చించడం నాకిష్టం లేదు. కానీ ఆరోజుల్లో అది నాకు చాలా పెద్ద అమౌంట్. ఒక వ్యక్తిని హామీ ఇచ్చి డబ్బిలిప్పించారు జగపతి బాబు. ఆయన మధ్యలో ఎంటర్ అయి.. నాది హామీ అని గ్యారెంటీ ఇవ్వడంతోనే నేను డబ్బులిచ్చా. కానీ ఆ వ్యక్తి డబ్బు తిరిగివ్వలేదు. డబ్బు వెనక్కిచ్చారా లేదా..? అని జగపతిబాబు కూడా అడగలేదు. నాకు బాదైతే కలిగింది. మొత్తం రూ.14 లక్షలు'' అంటూ చెప్పుకొచ్చారు. 


త్రివిక్రమ్ సినిమా అందుకే వద్దన్నా:
''త్రివిక్రమ్ తో కలిసి కొన్ని సినిమాలకు పని చేశాను. నా సినిమాలకు రైటర్ గా పని చేశారాయన. 'అతడు' సినిమాలో సోనూసూద్ రోల్ లో నటించమని ముందుగా త్రివిక్రమ్ నన్నే అడిగారు. నేను వెంటనే ఎడిటర్ మోహన్ గారి దగ్గరకి వెళ్లి విషయం చెప్పాను. ఇండస్ట్రీలో ఆయన నాకు బాగా క్లోజ్. అప్పా(నాన్న) అని పిలుస్తుంటాను. అతడికి విషయం చెప్పినప్పుడు.. హీరోగా చేస్తున్నప్పుడు విలన్ గా అంటే తరువాత ఇబ్బంది పడతావేమో అని అన్నారు. దీంతో నేను ఆ సినిమా రిజెక్ట్ చేశాను. ఆ తరువాత రెండు, మూడు సార్లు త్రివిక్రమ్ ను సినిమా అవకాశాల కోసం సంప్రదించాను. కానీ కుదరలేదు. ఆయన హెల్ప్ చేస్తారనే నమ్మకమైతే ఉంది'' అంటూ తెలిపారు.  


Also Read : స్టార్స్ సెక్స్ లైఫ్ గురించి అడిగితే మీ అమ్మ ఏమీ అనుకోరా? - కరణ్ జోహార్‌ను ఆటాడుకున్న ఆమిర్ ఖాన్


Also Read :సిగ్గు లేకుండా వెళ్ళి తులసిని బతిమలాడుకోమంటున్న లాస్య- శ్రుతి కోసం కౌసల్యకి ఫోన్ చేసిన తులసికి ప్రేమ్ విషయం తెలిసిపోతుందా?