యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' తరువాత ఇప్పటివరకు మరో సినిమాను మొదలుపెట్టలేదు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన సినిమాలు చేయనున్నారు. ముందుగా కొరటాల శివ సినిమాను మొదలుపెట్టాల్సివుంది. కానీ ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. జూలై లేదా ఆగస్టు నెలలో ఈ సినిమా మొదలవ్వాలి కానీ ఇప్పుడు ప్లాన్స్ అన్నీ మారిపోయాయి. స్క్రిప్ట్ లో మార్పులు చేయడానికి కొరటాలకి మరింత సమయం ఇచ్చారు ఎన్టీఆర్. 


మరోపక్క 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సానాను కూడా ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట ఎన్టీఆర్. రెండు నెలల్లో స్క్రిప్ట్ పూర్తయితే.. కొరటాల శివ, బుచ్చిబాబు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు ఎన్టీఆర్. ముందుగా కొరటాల శివ సినిమాను అక్టోబర్ నెలలో మొదలుపెట్టనున్నారు. అక్టోబర్ నుంచి మూడు నెలల తరువాత అంటే 2023 ఆరంభంలో బుచ్చిబాబు సినిమా కూడా మొదలైపోతుంది. 


అప్పటికి కొరటాల సినిమా కూడా సెట్స్ పై ఉంటుంది. అలా రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేయాలనేది ఎన్టీఆర్ ప్లాన్. మరోపక్క.. తమిళ దర్శకుడు వెట్రిమారన్ కూడా రీసెంట్ గా ఎన్టీఆర్ ని కలిశారు. అతడితో కలిసి పని చేయడానికి ఎన్టీఆర్ ఆసక్తి చూపించారు. కానీ ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశాలు లేవు. ఎన్టీఆర్, వెట్రిమారన్ ఇద్దరికీ కూడా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇక ప్రశాంత్ నీల్ సినిమాను 2023 మిడ్ లో మొదలుపెట్టే ఛాన్స్ ఉంది.  


Also Read : స్టార్స్ సెక్స్ లైఫ్ గురించి అడిగితే మీ అమ్మ ఏమీ అనుకోరా? - కరణ్ జోహార్‌ను ఆటాడుకున్న ఆమిర్ ఖాన్


Also Read :సిగ్గు లేకుండా వెళ్ళి తులసిని బతిమలాడుకోమంటున్న లాస్య- శ్రుతి కోసం కౌసల్యకి ఫోన్ చేసిన తులసికి ప్రేమ్ విషయం తెలిసిపోతుందా?