Biden on Ayman Al-Zawahiri: అమెరికన్లకు హాని కలిగిస్తే ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా వెతికి మరీ మట్టుపెడతామని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరీని హతమార్చినట్లు జో బైడెన్ అధికారికంగా ప్రకటించారు. అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో జరిపిన డ్రోన్ దాడిలో జవహరీని మట్టుబెట్టినట్లు ఆయన తెలిపారు.
వార్నింగ్
ఈ ఆపరేషన్‌పై ట్విటర్‌లోనూ బైడెన్ స్పందించారు. అమెరికా ప్రజల జోలికొస్తే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
టార్గెట్ కంప్లీట్
ఈ ఆపరేషన్‌కు బైడెన్ జులై 25న ఆమోదం తెలిపినట్లు సమాచారం. అఫ్గాన్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ ఆపరేషన్‌ను అమెరికా సైన్యం విజయవంతంగా చేపట్టింది. జవహరీ కాబుల్‌లోని తన నివాసంలో బాల్కనీలో ఉండగా రెండు హెల్‌ఫైర్ క్షిపణులు అతడిని లక్ష్యంగా చేసుకున్నాయి.
కేవలం జవహరీని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టడంతో భవనంలోని ఒక అంతస్తు మాత్రమే ధ్వంసమైంది. ఈ దాడిలో కేవలం జవహరీ మాత్రమే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం అమెరికా పెద్ద కసరత్తే చేసింది. జవహరీ దినచర్యను దగ్గరుండి పరిశీలించేందుకు ఓ అధికారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. బాల్కనీలో నిల్చున్నది జవహరీ అని ఆ అధికారి కన్ఫమ్ చేసిన తర్వాతే దాడి చేసింది. ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో జవహరీ ఒకడు. లాడెన్ హతమైన తర్వాత అల్‌ఖైదా పగ్గాలను జవహరీ చేపట్టాడు.
Also Read: Al-Qaeda Chief Killed: అమెరికా డ్రోన్ అటాక్, అల్ ఖైదా అధినేత అల్ జవహరీ హతం
Also Read: Bengaluru News: భార్య చేసిన చికెన్ పకోడా తిని ఆమెను పొడిచి భర్త ఆత్మహత్య!