కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ క్లారిటీ ఇచ్చారు. దివంగత ఎమ్మెల్యే భార్యకే టికెట్‌ ఇచ్చినందున జనసేన పోటీ చేయడం లేదని తెలిపారు. బద్వేలు జనసేన నేతలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవాలని వైసీపీకి సూచించారు. బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక ఈనెల 30న జరగనుంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. 




రాయలసీమ పోరాటాల గడ్డ


ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రఘురామకృష్ణంరాజు, జేసీ దివాకర్ రెడ్డి లాంటి నేతలకు మనమంతా అండగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతపురం జిల్లా కొత్తచెరువులో జరిగిన రోడ్డుషోలో పాల్గొన్న పవన్ కల్యాణ్ తాను వస్తేనే రోడ్లు వేస్తున్న ఇలాంటి నాయకులకు ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు. ధైర్యాన్ని గుండెల్లో దాచుకొని రాయలసీమ నేతలు పోరాటాలు చేయాలన్నారు. రాయలసీమ లోనే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నిర్మిస్తామని, ఇక్కడే కూర్చొని అభివృద్ధి ఏంటో చూపిస్తానన్నారు పవన్ కల్యాణ్. వంద మంది బాంబులతో వస్తే తాను ఎదురొడ్డి నిలబడతానని, పోరాటస్ఫూర్తిని కొనసాగిస్తాన్నారు. రాయలసీమ పోరాటాల గడ్డ అన్న పవన్ గ్రామానికి సంగ్రామనికి ఎంత దూరమన్నది గుర్తించుకొని పోరాటాలు చేయాలన్నారు. 








Watch Video  : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరి కోసం? పార్టీ కోసమా? సినీ పరిశ్రమ కోసమా?


అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు 


దళితులపై దాడులు చేస్తే ప్రశ్నించే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేకపోవడం శోచనీయమని అన్నారు జనసేన అధినేత పవన్. షెడ్యుల్ కంటే దాదాపు ఐదు గంటలు ఆలస్యంగా పవన్ కార్యక్రమం ప్రారంభమయ్యింది. కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయడం తనకు ఇష్టం ఉండదన్నారు. అనంతపురం జిల్లాలో బోయలు అధికారంలోకి ఎందుకు రావడం లేదన్నది ఆలోచించండి అని అన్నారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని పవన్ ప్రశ్నించారు. 


Also Read: మాటల్లో చెప్పిన ‘రాజకీయం’ చేతల్లో చూపిస్తే తిరుగులేనట్లే..! పవన్ కల్యాణ్ ‘సొంత’ బాట ..?






ప్రజాస్వామ్యంలో భయానికి చోటు లేదు


రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా అనంతపురం జిల్లాలోని నాగులకనుమ వద్ద పవన్‌ కల్యాణ్ శ్రమదానం చేశారు. అనంతరం కొత్త చెరువు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్‌ ప్రసంగించారు. రాయలసీమ నుంచి యువత వలసపోతున్నారని పవన్ అన్నారు. సీమ నుంచి సీఎంలు వచ్చినా ఈ ప్రాంతం అభివృద్ధి కాలేదన్నారు. భయపెడితే పరిశ్రమలు వస్తాయా అని ప్రశ్నించారు. చదువుల సీమను కరువు సీమగా, వెనుకబడిన ప్రాంతంగా మార్చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనదే అధికారం. వైసీపీ పాలన బాగుంటే రోడ్లమీదకు వచ్చే వాళ్లం కాదన్నారు. రాయలసీమ పోరాటాల, పౌరుషాల గడ్డ అని పవన్ అన్నారు. ప్రజాస్వామ్యం అనే ఆయుధాన్ని ప్రజలు వాడుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో భయానికి చోటు లేదన్నారు. పోరాడేందుకు టీడీపీ కూడా వెనుకంజ వేస్తోందన్న పవన్... వచ్చిన పరిశ్రమలను కూడా బెదిరిస్తున్నారన్నారు. 


Also Read: బూతులు తిడితే ఇక తాట తీయడమే .. రాజమండ్రిలో పవన్ మాస్ వార్నింగ్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి