రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజల సొమ్ములను పన్నులుగా తీసుకుంటున్న ప్రభుత్వం బాధ్యత మరిచిందని.. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని స్పష్టం చేశారు.  మన పన్నులు ప్రభుత్వం ఖాజానాకు వెళ్తాయి. ప్రభుత్వం వద్ద డబ్బులున్నాయి. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అందుకే గాంధీ స్ఫూర్తితో శ్రమదానానికి ముందుకు వచ్చామన్నారు. పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ఉందని ప్రజలకు ఉన్న హక్కునూ ఎవరూ ఆపలేరని  స్పష్టం చేశారు. 


పన్నులు వసూలు చేస్తున్నా రోడ్లు వేయరా ? 
సజ్జల రామకృష్ణారెడ్డి తమ శ్రమదానంను అడ్డుకోవాలని పోలీసులకు ఆదేశాలిచ్చారని అలా చెప్పడం సరి కాదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన నేరాలు, ఘోరాలన్నీ చేస్తోందన్నారు.వివేకా హత్యపై ఆ పార్టీనేతలు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. పోలీసులే మా వెంట పడితే మేం ఎవరికి చెప్పకోవాలన్నారు. క్రిమినల్‌ గ్యాంగ్‌కు వంతపాడి సెల్యూట్‌ చేయడం బాధగా ఉందని..  ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు వారి పని  వాళ్లు చేయాలని పవన్ సలహా ఇచ్చారు. యంత్రాంగం తమ పని తాము చేయకపోతే రోడ్డు మీదికి మేము వస్తామని ప్రశ్నించారు.


Also Read : అమరావతిలో పవన్‌ను కలిసిన అగ్రనిర్మాతలు ! ఒంటరిని చేయలేదని క్లారిటీ ఇచ్చారా?


ఏపీలో గుంతలు లేని రోడ్డుందా ? 
ధవళేశ్వరంపై అంటే అక్కడ.. అనంతపురంలో అంటే అక్కడా రోడ్లేశారన.ి. అసలు రాష్ట్రంలో గుంతలు లేని రహదారి రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. యువత ఉపాధి కల్పిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్‌కుఓటు వేసినా.. ఏమీ చేయలేదన్నారు. అధికారం అందిందని అన్ని కులాల్ని కుళ్ల బొడుస్తున్నారని..  రెడ్డి సామాజిక వర్గంలోనూ చాలా బాధ ఉందన్నారు.


 
ఓ కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించి రాజకీయం చేస్తారా? 
బూతులు తిట్టి మానసిక అత్యాచారాలు చేస్తున్నారని..ఇక నుంచి ఊరుకునేది లేదని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తొక్కే కొద్దీ పైకి లేస్తామన్నారు. తన కోసమే ఆలోచిస్తే తిట్టినవారిని కింద కూర్చోబెట్టి నార తీసేవాడిని కానీ ప్రజల కోసమే తిట్లు తింటున్నానని ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే కులం పేరుతో విమర్శించడాన్ని తప్పు పట్టారు. . ఏ కులంలో పుట్టాలో ఎంపిక చేసుకునే అవకాశం ఎవరికీ ఉండదని.. కానీ ఎలా ప్రవర్తించాలనేది మన చేతిలో ఉందని స్పష్టం చేశారు.  ఒకరు అన్నారని కులాన్ని నిందించకూడదన్నారు.  ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించి.. రాష్ట్రాన్ని నాశనం చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  


Also Read : మాటల్లో చెప్పిన ‘రాజకీయం’ చేతల్లో చూపిస్తే తిరుగులేనట్లే..! పవన్ కల్యాణ్ ‘సొంత’ బాట ..?


 
వచ్చే ఎన్నికల్లో జనసేనదే గెలుపు 
వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. జనసేన అంటే వైఎస్‌ఆర్‌సీపీకి భయం ఉందన్నారు. 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నవాణ్ని. పోతే ప్రాణం పోవాలి.. రాజకీయాల నుంచి పారిపోయేది లేదు. కాపు, తెలగ, ఒంటరి, బలిజలు ముందుకొస్తే తప్ప రాష్ట్రం బాగుపడదు. కమ్మలకు జనసేన వ్యతిరేకం కాదని చెప్పేందుకు టీడీపీకి మద్దతిచ్చానన్నారు. సమాజంలో మార్పు అనేది గోదావరి జిల్లాలపై ఆధారపడి ఉందని పిలుపునిచ్చారు.


Also Read : రాజు తలుచుకుంటే వరాలకు కొదవా? సీఎం జగన్ కు నిర్మాత అల్లు అరవింద్ రిక్వెస్ట్.. సినీ ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించాలని వినతి  
 
సీఎం అయిన తర్వాతనే సీఎం అనాలని అభిమానులకు హితవు
పవన్ ప్రసంగం ప్రారంభించిన కొన్ని క్షణాలకే.. "సీఎం.. సీఎం.." అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో సీఎం అయినప్పుడే అరవండి.. అప్పటి వరకూ ఒక్క మాట కూడా సీఎం అని అరవొద్దని కార్యకర్తలకు సూచించారు.  నేను సీఎం అవ్వాలని మీరు మనసులో అనుకోవాలని బయటకు చెప్పవద్దని సూచించారు.    


Also Read : ఎవరి ఈగోను వారు తృప్తి పరుచుకుంటున్నారు.. పంజాబీ పిల్ల పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్


అనంతపురం పర్యటనకు ఆటంకాలు
రాజమండ్రి నుంచి పుట్టపర్తికి వెళ్లాల్సిన పవన్‌కు ఆటంకాలుఎదురయ్యాయి.  పుట్టపర్తిలో పవన్‌ విమానం ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించారు. దీంతో జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాజమహేంద్రి ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా బెంగళూరుకు పవన్‌ వెళ్లి ...అక్కడ్నుంచి రోడ్డు మార్గం ద్వారా కొత్త చెరువులో దెబ్బతిన్న రోడ్లకు పవన్ శ్రమదానం చేస్తారు.


Watch Video : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరి కోసం? పార్టీ కోసమా? సినీ పరిశ్రమ కోసమా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి