కాశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం జరిగిన పాకిస్థాన్ చెందిన టెర్రరిస్ట్ రిసెస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రమూకల దాడిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాసులు మరణించారు. ఒకరు వైజాగ్ కి చెందిన చంద్రమౌళి కాగా మరొకరు కావలికి చెందిన  మధుసూదన్. చంద్రమౌళి మృతదేహం వైజాగ్ చేరుకుంది. మధుసూదన్ ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్నారు.

Continues below advertisement



చంపొద్దని వేడుకుంటున్నా వినని తీవ్ర వాదులు 
 వైజాగ్ కు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి భార్యతో సహా కాశ్మీర్ టూర్ కి వెళ్లారు. ఈ నెల 18న ఆరుగురు తో కలిసి ఒక బృందంగా  వారి జమ్మూ కాశ్మీర్లో పర్యటనకు వెళ్లారు. పెహల్గాం లో వారినటకాయించిన ఉగ్రవాదులు  చంపొద్దు అని వేడుకుంటున్నా వినకుండా  చంద్రమౌళి ని కాల్చి చంపారు. చంపేముందు వారి ఐడీలు చెక్ చేసి మరీ కాల్చేసినట్టు ఆ బృంద సభ్యులు చెప్తున్నారు. సమాచారం అందుకున్న ఆయన బంధువులు  వైజాగ్ నుంచి కాశ్మీర్ వెళ్లి  ఆయన మృత దేహాన్ని వైజాగ్ తరలించారు. ఈ దుర్ఘటన తో విశాఖ నగరంలో  విషాదఛాయలు అమ్ముకున్నాయి. ఇదే ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఏపీకి చెందిన మరో వ్యక్తి  మధు సూదన్ కావలి ప్రాంతానికి చెందిన వ్యక్తి. అయితే బెంగళూరులో స్థిరపడ్డారు. 



ప్రభుత్వం నివాళి 


 తీవ్రవాదుల అమానుష దాడిలో చనిపోయిన వారికి ఏపీ ప్రభుత్వం నివాళి ప్రకటించింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి  వ్యక్తం చేయగా..ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు  జనసేన జెండాను పార్టీ కార్యాలయం పై నుంచి సంతాప సూచకం గా దించేయాలని ఆదేశించారు. చంద్రమౌళి మృతి పట్ల విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి  డోలా  బాల వీరాంజనేయ స్వామి సంతాపం ప్రకటిస్తూ ఆయన భార్య, కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి  ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


ఇక ఇదే దాడిలో హైదరాబాదులోని ఐబి (ఇంటెలిజెన్స్ బ్యూరో) లో పనిచేస్తున్న మనీష్ రంజన్ అనే ఆఫీసర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆయన బీహార్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు ప్రకటించారు. పెహల్గాం జరిగిన ఈ అమానుష దాడిలో  ఏపీకి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం  రాష్ట్ర ప్రజలను షాక్ కు గురించేసింది. TRF అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడి తామే చేసినట్టు ప్రకటించగా ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామని ప్రభుత్వం ఆర్మీ ప్రకటించాయి.