సినీ పరిశ్రమలో అనేక సమస్యలున్నాయని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. పరిశ్రమలో సమస్యలను సీఎం జగన్ త్వరగా పరిష్కరించాలని కోరారు. కరోనా నుంచి ప్రజలను రక్షించినట్లే సినీ పరిశ్రమను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా విడుదలయ్యే సినిమాలు ప్రభుత్వంపై ఆధారపడి ఉన్నాయన్నారు. పరిశ్రమ విజయవంతంగా కొనసాగడానికి సీఎం జగన్ సహకారం అవసరమన్నారు. రాజు తలుచుకుంటే వరాలకు కొదవా అని అల్లు అరవింద్ అన్నారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ట్రైలర్ వేడుకలో అల్లు అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: ‘9000 రాత్రులు కలిసి పడుకోవాలి’.. మోస్ట్ రొమాంటిక్ ట్రైలర్ వచ్చేసింది!
ట్రైలర్ రిలీజ్
చిత్ర పరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని నిర్మాత అల్లు అరవింద్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. రాజు తలుచుకుంటే వరాలకు కొదవా అని దయచేసి విన్నపాన్ని ఇండస్ట్రీ విన్నపంగా మన్నించి సమస్యలు పరిష్కరించండి అని అన్నారు. అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ సినిమా గీతాఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. బన్నీ వాస్, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబరు 15న విడుదల కానుంది. గురువారం థియేట్రికల్ ట్రైలర్ విడుదల వేడుక నిర్వహించారు.
సీఎం జగన్ కు విన్నపం
ఈ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి మొదటి ఫంక్షన్ ఇది అన్నారు. దీని తర్వాత ప్రీరిలీజ్ వేడుక, సక్సెస్‌మీట్ తప్పకుండా ఉంటాయన్నారు. గీతాఆర్ట్స్‌లో విజయవంతమైన చిత్రాలు ప్రేక్షకులే తమకు అందించారన్నారు. తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన ధైర్యాన్ని చూసి, బాలీవుడ్ సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయని అరవింద్ అన్నారు. ఈ వేదికగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరేది ఒక్కటే అన్న ఆయన... ఫిల్మ్ ఇండస్ట్రీ అనేక ఇబ్బందుల్లో ఉందని, రాజు తలుచుకుంటే, వరాలకు కొదవా? దయచేసి పరిశ్రమలో ఉన్న సమస్యలకు పరిష్కారించాలని కోరారు.
Also Read: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంచు విష్ణు.. ‘మా’లో నామినేషన్ దాఖలు
Also Read: ‘కొండపొలం’ సాంగ్.. ‘శ్వాసలో హద్దులని దాటాలనే ఆశ’ అంటూ రకుల్‌తో తేజ్ రొమాన్స్!