ఏపీలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ లక్ష్యంలో భాగంగా రూపొందించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్‌) కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించారు. విజయవాడలోని బెంజి సర్కిల్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. 4,097 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. గార్బేజ్ టిప్పర్‌, హై ప్రెజర్‌ క్లీనర్లను జగన్ పరిశీలించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమ ప్రచార సీడీని ఆవిష్కరించారు. ఈ వాహనాలు బెంజి సర్కిల్ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లనున్నాయి. జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజులపాటు కొనసాగనుంది. లిటర్‌ ఫ్రీ, బిన్‌ ఫ్రీ, గార్బేజ్‌ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్ది.. జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో బెస్ట్ ర్యాంక్‌ సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 



Also Read: పవన్ కల్యాణ్ పర్యటనపై టెన్షన్.. టెన్షన్.. అక్కడ నో ఎంట్రీ అని చెప్పిన పోలీసులు


ప్రతీ ఇంటికీ మూడు డస్ట్ బిన్‌లు..
తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేరు చేసేలా మూడు డస్ట్‌ బిన్‌లను తీసుకొచ్చారు. వీటిని ప్రతీ ఇంటికి పంపిణీ చేయనున్నారు. ఇళ్లలోనే ఈ మూడు రకాల చెత్తను వేరు చేసేలా వీటిని రూపొందించారు. ఈ డస్ట్‌ బిన్‌లు గ్రీన్, రెడ్, బ్లూ రంగుల్లో ఉంటాయి. క్లాప్‌ కార్యక్రమంలో భాగంగా వీటిని మునిసిపాలిటీల్లో పంపిణీ చేస్తారు. 123 కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీల్లోని 40 లక్షల ఇళ్లకు 1.2 కోట్ల డస్ట్‌ బిన్‌లను అందిస్తారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులను కేటాయించింది. దీంతో పాటుగా జన సంచారం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో 1,500 పబ్లిక్‌ టాయిలెట్లను నిర్మించనున్నారు. చెత్త సేకరణ, తరలింపునకు 3,097 ఆటో టిప్పర్లు.. 1,771 ఎలక్ట్రిక్‌ ఆటోలను తీసుకొచ్చారు. 



Also Read: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష... పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఆరా... ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు


గార్బేజ్‌ టిప్పర్ల ద్వారా గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లకు..
ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను 5,868 జీపీఎస్‌ (GPS) ఆధారిత గార్బేజ్‌ టిప్పర్ల ద్వారా గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లకు తరలిస్తారు. చెత్త రవాణాకు గ్రామ పంచాయతీలకు 14 వేల త్రిచక్ర వాహనాలు పంపిణీ చేస్తారు. చెత్త సేకరణ, రవాణాను మరింత మెరుగుపరిచేందుకు 1000 ఆటోలు సమకూరుస్తారు. 


Also Read: ఏపీ గ్రూప్ -1 అభ్యర్ధులకు గుడ్ న్యూస్.. మెయిన్ పేపర్లు మాన్యువల్ పద్దతిలో దిద్ది ఫలితాలు ప్రకటించాలన్న హైకోర్టు !


Also Read: పవన్ ఏపీకి గుదిబండలా తయారయ్యారు... పవన్ చేసేవి పబ్లిసిటీ పోరాటాలు... మంత్రి ఆదిమూలపు సురేశ్, సజ్జల కామెంట్స్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి