కరోనా సమయంలో  ఉద్యోగాలు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం మూడు నెలల జీతం అందించనుంది. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన ఈఎస్ఐసీ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం మూడు నెలల వేతనం ఇవ్వనుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ విషయాన్ని తెలిపారు. 


కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఈఎస్ఐసీ సభ్యుల బంధువులకు కూడా.. జీవితకాల ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తున్నామని భూపేంద్ర యాదవ్ తెలిపారు. అన్నీ రాష్ట్రాల్లో లేబర్ కోడ్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. కొత్త కార్మిక చట్టాన్ని అమలు చేసే ప్రక్రియ కూడా కొనసాగుతోందని చెప్పారు.


ఈ-శ్రమ్  పోర్టల్ లో నమోదు చేసుకోవాలని కేంద్ర మంత్రి తెలిపారు.  నిర్మాణ రంగం, వలస కార్మికులు..ఇలా అసంఘటిత రంగంలో 38 కోట్ల మంది కార్మికులను నమోదు చేయడం ప్రభుత్వ లక్ష్యం అని ఆయన చెప్పారు. ' ఈ శ్రమ్ పోర్టల్ లో రిజిస్టర్ అయ్యాక 12 అంకెల ఈ-లేబర్ కార్డ్ జారీ చేయబడుతుంది. భవిష్యత్తులో, కార్మికులు ఈ కార్డు ద్వారా సామాజిక భద్రతా పథకాల్లో చేరొచ్చు. ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల ఈఎస్ఐ కార్డులు ఆధార్‌తో లింక్ చేయబడతాయని.. కేంద్రమంత్రి తెలిపారు.


తర్వాతి దశలో, వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్ తరహాలో 'వన్ నేషన్-వన్ ఈఎస్ఐ కార్డ్' వచ్చేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఇది అమలులోకి వస్తే.. భవిష్యత్తులో సంబంధిత ఉద్యోగులు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఈఎస్ఐ, దాని అనుబంధ ఆసుపత్రులలో ఆరోగ్య సదుపాయాన్ని పొందుతారు.


ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ఆరోగ్య సేవలను ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా బలోపేతం చేస్తామని ఉత్తరాఖండ్‌లో కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన జరిగిన 185వ కార్పొరేషన్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని కింద, ఈఎస్ఐ ఆసుపత్రులలో అందుబాటులో లేని వైద్య సౌకర్యాలు ప్యానెల్‌లో చేరుస్తారు. మెడికల్ సర్వీస్ ప్రొవైడర్‌ల కోసం రోగిని ఉపయోగించుకునేందుకు రిఫర్ చేస్తారు. ఒక ప్రాంతంలో ఈఎస్ఐ సౌకర్యం 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నట్లయితే, అటువంటి పరిస్థితిలో రోగులు నేరుగా చికిత్స కోసం ప్యానెల్‌లో ఉన్న ఆసుపత్రులను సంప్రదించవచ్చు.


Also Read: Gautam Adani: రోజుకు వెయ్యి కోట్లు ఆర్జిస్తున్న అదానీ.. ఇండియా టాప్‌-10 కుబేరులు వీళ్లే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి