ABP  WhatsApp

Punjab CM Meets PM Modi: ప్రధానితో పంజాబ్ సీఎం భేటీ.. అమరీందర్ సింగ్ కొత్త పార్టీ!

ABP Desam Updated at: 01 Oct 2021 06:54 PM (IST)
Edited By: Murali Krishna

ప్రధాని నరేంద్ర మోదీతో పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ భేటీ అయ్యారు. మూడు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు చన్నీ తెలిపారు.

ప్రధానితో పంజాబ్ సీఎం భేటీ.. అమరీందర్ సింగ్ కొత్త పార్టీ!

NEXT PREV

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఓ గంటపాటు ఈ సమావేశం జరిగింది. సీఎం అయిన తర్వాత ప్రధానితో సీఎం చన్నీకి ఇదే మొదటి భేటీ. మూడు అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకువచ్చినట్లు చన్నీ తెలిపారు.







గౌరవసూచికంగానే ప్రధానిని కలిసినప్పటికీ మూడు అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లాను. పంజాబ్‌లో సాధారణంగా పంట కొనుగోలు ప్రక్రియ అక్బోబర్ 1న మొదలవ్వాలి. కానీ కేంద్రం అక్టోబర్ 10న ప్రారంభిస్తుంది. వెంటనే ఈ ప్రక్రియ మొదలు పెట్టాలని కోరాను. అలానే సాగు చట్టాలపై రైతులు చేస్తోన్న పోరాటం గురించి ప్రధానికి వివరించాను. వెంటనే వారితో చర్చలు జరపి సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాను. అలానే కరోనా కారణంగా మూసేసిన కర్తార్‌పుర్ కారిడార్‌ను వీలైనంత త్వరగా పునఃప్రారంభించాలని తెలిపాను.                                   -  చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ సీఎం


అధిష్ఠానంతో చన్నీ భేటీ..


ప్రధాని మోదీతో భేటీ ముగిసిన అనంతరం చన్నీ.. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవనున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాహుల్ గాంధీతో కీలక భేటీ జరగనుందని తెలుస్తోంది. నవజోత్ సింగ్ సిద్ధూతో జరిపిన చర్చల సారాంశాన్ని రాహుల్ గాంధీకి చన్నీ వివరించనున్నారు.


అమరీందర్ కొత్త పార్టీ..


కాంగ్రెస్‌ పార్టీకి ఇటీవల గుడ్‌బై చెప్పిన మాజీ సీఎం, కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే 15 రోజుల్లో అమరీందర్‌ నూతన రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ విషయమై ఇప్పటికే తన మద్దతుదారులతో విస్తృతంగా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.


Also Read:US North Korea: 'కిమ్' అనకుండా బైడెన్ సైలెంట్.. అమెరికా దూకుడు ఏమైంది?


Also Read: SC on Farmers Protest: 'రైతులారా ఇక ఆపండి.. నగరానికి ఊపిరాడనివ్వండి'


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 01 Oct 2021 06:51 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.