టాలీవుడ్ లో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన సిద్ధార్థ్.. ఇక్కడ అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ కి వెళ్లిపోయాడు. తన స్నేహితులతో కలిసి 'గృహం' అనే సినిమా చేశాడు. దీనికి ప్రేక్షకుల మంచి అప్లాజ్ వచ్చింది. ప్రస్తుతం సిద్ధార్థ్ కి తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఇటువైపుగా అడుగులు వేస్తున్నాడు. ఆయన నటించిన 'మహాసముద్రం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాల విషయం పక్కన పెడితే ఈ హీరో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు సినీ, రాజకీయ అంశాలపై స్పందిస్తుంటారు.
Also Read:సమంతతో విడాకులు - నాగచైతన్య అధికారిక ప్రకటన !
ఇదిలా ఉండగా.. తాజాగా సిద్ధార్థ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ''స్కూల్ లో నేను నేర్చుకున్న మొదటి పాఠం ఏంటంటే.. ''మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు''.. మరి మీ సంగతేంటి..?'' అని నెటిజన్లను ప్రశ్నించాడు. ఉన్నట్టుండి సిద్ధార్థ్ ఇలా చీటర్స్ గురించి పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. సిద్ధార్థ్ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారనే విషయంలో సమంత పేరు బలంగా వినిపిస్తోంది.
గతంలో సిద్ధార్థ్-సమంత డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి చెన్నైలోనే ఉండేవారు. కానీ ఇద్దరిమధ్య విభేదాలు ఏర్పడడంతో ఒకరికొకరు దూరమయ్యారు. ఈ విషయాన్ని సమంత అఫీషియల్ గా ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఇప్పుడు సమంత.. చైతు నుంచి కూడా విడిపోతుండడంతో.. ఆమె విడాకుల విషయాన్ని టార్గెట్ చేస్తూ సిద్ధార్థ్ ఇలాంటి ట్వీట్ వేశాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఇలాంటి సమయంలో ఈ మాటలు అవసరమా అంటూ సిద్ధార్థ్ ను తిట్టిపోస్తున్నారు.
Also Read: ప్రేమగా దగ్గరై.. పెళ్లితో ఒక్కటై.. చివరకు దూరమై..
Also Read: 'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్.. ఇక ఆ హీరోలకు కష్టమే..
Also Read: లోబో 'బస్తీ' కామెంట్స్ పై మండిపడ్డ నాగ్.. అందరూ ఒక్కటే అంటూ వార్నింగ్
Also Read: రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన 'పుష్ప' టీమ్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు
Also Read: నాలుగేళ్ల క్రితం ఆగిన 'ఆరడుగుల బుల్లెట్' మెగా హీరోకి పోటీగా ఇప్పుడు దూసుకొస్తోంది..